Accommodation, Seva in Tirumala


తిరుమల స్వామి వారి దర్శనం తరువాత కొండా పైన చూడవలసిన ప్రదేశాలు, తప్పకుండ చూసి వెళ్ళండి
visiting-places-in-tirumala
పాపనాశనం PAPANASANAM

kapila-theertham-in-tirumala

పాప వినాశనము లేదా పాప నాశనము తిరుమలలో ఉంది. ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తరదిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆశ్వీయుజమాసంలో శుక్లసప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి, పవిత్రస్నానం చేయటం పరమపావనమని బ్రహ్మపురాణం, నాలుగో అధ్యాయం పేర్కొంటోంది.

AKASAGANGA ఆకాశగంగా

papavinasanam-tirumala

మీరు పాపవినాశనం నుంచి ఆకాశగంగా కు బయలుదేరాలి దారిలోనే ఉంటాది
తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు 3 కే.మీ దూరంలో `ఆకాశ గంగ తీర్ధం ఉంది. హిమచలంలో ప్రవహించిన గంగమూడు పాయలయిoది.ఆకాశభాగాన ప్రవహిస్తూ సాక్షాత్కరించిన గంగ, ఈ ఆకాశగంగ మర్త్యగంగ శ్రీ విశ్వేశ్వరస్వామి అభిషేకాధులకు ఉపయోగపడుతూ ఉంది. ఆకాశగంగ తీర్ధమహత్యాన్ని వరాహ-పద్మ-స్కంద పురాణాలూ విశదం చేస్తున్నాయి. సంతానం లేని వ్యక్తిని భోక్తగా నియమించి శ్రాద్ధం చేయడం వల్ల గార్ధభముఖుడయిన పుణ్యశిలుని కడతేర్చిన తీర్ధం.మేషమాసం చిత్తనక్షత్రంతో కూడిన పూర్ణిమా దినం ఈ తిర్ధనికి పర్వదినం


జాబాలి తీర్థము

jubali-theertham-in-tirumala

జాపాలి. ఈ ఆలయం తిరుమలలో ఉన్నది. ఇది పాప వినాశం నకు పోవు మార్గం లో ఒక మలుపు వద్ద ఆంజనేయుని ముఖ మార్గం కనిపిస్తుంది. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు. ఇక్కడ భగవాన్ హనుమంతుడు వెలిశి ఉన్నారు. ఈ ఆలయం సమీపమునక వెళ్లే కొద్ది ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది.ఎందుకంటే ఇక్కడ ఆ ఆంజనేయడు కొలువై ఉన్నారు. చుట్టూ అడవి, ఆలయం ముందు కొలను ఎంతో మనోహరంగా ఉంటాయి.


తిరుమల శ్రీవారి పాదాలు

tirumala-srivari-padalu-tirumala

శ్రీ వారి పాదాలు తిరుమల కొండలలో ఎత్తైన కొండపైన ఉన్నాయి. ఇక్కడి ప్రయాణం చెయ్యడానికి సింగిల్ రోడ్డు కలదు, టాక్సీలో వెళ్ల వచ్చు. వంద నుండి రెండు వందల వరకూ చార్జి చేస్తారు. దారిలో చక్రతీర్థం, శిలా తోరణం కూడా దర్శించ వచ్చు. శ్రీ వారి పాదాల మండపము నుండి తిరుమల లోయ బహు సుందరంగా కనిపిస్తుంది. ఇక్కడి పైన్ వృక్షాలు అత్యంత మనోహరంగా ఫోటోలు తీసుకోవడానికి బాగుంటాయి. మహావిష్ణువు వైకుంఠం నుండి వేంకటాద్రికి దిగి వచ్చేప్పుడు మెదటి పాదాన్ని ఇక్కడ పెట్టాడని, రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని, మూడవ పాదాన్ని నేడు ఆనందనిలయంలో స్వామి వున్న ప్రదేశంలో పెట్టాడనీ చెబుతారు. sila-thoranam-tirumala

తిరుమల శ్రీవారి పాదాలు నుంచి శ్రీవారి ఆలయం ఈ విధంగా చాల మనోహరం గ కనిపించును

vishnu-nivasam-guest-house-tirumala


srivaru-ttd-tirumala
FOLLOW US FB 74K FOLLOWED

శ్రీ గోవిందరాజ స్వామి

ఆల‌య నిర్మాణం:

ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంద‌రో రాజులు ఆస‌క్తి చూపించార‌న్న‌దానికి నిద‌ర్శ‌నంగా శాస‌నాలు క‌నిపిస్తాయి. 12వ శ‌తాబ్దానికి చెందిన చోళ‌రాజులు మొద‌ల్కొని, విజ‌య‌న‌గ‌ర రాజుల వ‌ర‌కూ ఈ ఆల‌యాన్ని ద‌శ‌ల వారీగా నిర్మించారు. ఈ ఆల‌యానికి ఉన్న ఏడంత‌స్తుల గోపురం ఎంతో దూరం వ‌ర‌కూ క‌నిపిస్తుంటుంది. దీనిమీద భాగ‌వ‌త‌, రామాయ‌ణ ఘ‌ట్టాలు క‌నిపిస్తాయి. బాహ్య గోపురం త‌రువాత ఉన్న మ‌రో చిన్న గోపురం పేరుకే చిన్న‌దైనా వంద‌ల‌మంది భక్తుల‌ను ఎండావాన‌ల నుంచి సేద‌తీర్చేంత విశాలంగా ఉంటుంది. సుప్ర‌భాతం, తోమాల‌సేవ వంటి రోజువారీ సేవ‌ల‌తో ఈ ఆల‌యం క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. ఇక ఏటా వ‌చ్చే బ్ర‌హ్మోత్స‌వాలు, ర‌థ‌స‌ప్త‌మి వంటి ప‌ర్వ‌దినాల‌లో త‌న త‌మ్ముని ఆల‌యానికి దీటుగా సంద‌డిగా మారుతుంది.

govindarajulu-tirupati-tirumala
తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet