శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం


తిరుపతి పట్టణంలో తప్పకుండా చూడవలసిన ఆలయం శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం . తిరుపతి రైల్వేస్టేషన్ దగ్గర్లో, కోనేటి గట్టున ఈ ఆలయం కలదు. ఈయన్ని శ్రీవేంకటేశ్వరునికి అన్న అని అంటారు. తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకొంటున్నాడట. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానములు సంస్థ నిర్వహణలోనే ఉంది.

govindarajulu-tirumala

govindarajulu-tirumala

govindarajulu-tirumala
govindarajulu-tirumala


govindarajulu-tirumala


govindarajulu-tirumala

తిరుమలలోని శ్రీవేంకటేశ్వరుని ఆలయం తరువాత భక్తులంతా శ్రద్ధగా దర్శించుకునే ఆలయం తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయం. ఇది తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి కేవలం అరకిలోమీటరు దూరంలో ఉంది. గోవిందరాజ స్వామి, వేంకటేశ్వర స్వామివారికి అన్నగారు. ఆయన వేంకటేశ్వరునికీ, పద్మావతి అమ్మవారికి మధ్య వివాహం అంగరంగ వైభవంగా జరిగేందుకు తోడ్పడ్డారట. వేంకటేశ్వరుడు తన కళ్యాణం కోసం కుబేరుని నుంచి అపారమైన ధనాన్ని రుణంగా తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే! అలా పొందిన ధనరాశులను లెక్కించేందుకు, సంరక్షించేందుకు, సవ్యంగా వినియోగించేందుకు గోవిందరాజస్వామి బాధ్యత వహించారట. అందుకని లేని ఐశ్వర్యాన్ని పొందాలన్నా, ఉన్నదాన్ని పెంపొందించుకోవాలన్నా గోవిందరాజస్వామి అనుగ్రహం ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాదు! వేంకటేశ్వరుని కళ్యాణానికి ముల్లోకాలలోనూ ఉన్న దేవతలందరినీ ఆహ్వానించారట గోవిందరాజులవారు. అందుకని గౌరవనీయులైన వ్యక్తులతో స్నేహబంధాలు కోరుకునేవారికి కూడా ఆయన ఆశీస్సులు ఉపయుక్తంగా ఉంటాయని నమ్ముతారు.

govindarajulu-tirumala

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని వృక్షం వద్ద నాగదేవత విగ్రహం

శ్రీ గోవిందరాజ స్వామి

ఆల‌య నిర్మాణం:

ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంద‌రో రాజులు ఆస‌క్తి చూపించార‌న్న‌దానికి నిద‌ర్శ‌నంగా శాస‌నాలు క‌నిపిస్తాయి. 12వ శ‌తాబ్దానికి చెందిన చోళ‌రాజులు మొద‌ల్కొని, విజ‌య‌న‌గ‌ర రాజుల వ‌ర‌కూ ఈ ఆల‌యాన్ని ద‌శ‌ల వారీగా నిర్మించారు. ఈ ఆల‌యానికి ఉన్న ఏడంత‌స్తుల గోపురం ఎంతో దూరం వ‌ర‌కూ క‌నిపిస్తుంటుంది. దీనిమీద భాగ‌వ‌త‌, రామాయ‌ణ ఘ‌ట్టాలు క‌నిపిస్తాయి. బాహ్య గోపురం త‌రువాత ఉన్న మ‌రో చిన్న గోపురం పేరుకే చిన్న‌దైనా వంద‌ల‌మంది భక్తుల‌ను ఎండావాన‌ల నుంచి సేద‌తీర్చేంత విశాలంగా ఉంటుంది. సుప్ర‌భాతం, తోమాల‌సేవ వంటి రోజువారీ సేవ‌ల‌తో ఈ ఆల‌యం క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉంటుంది. ఇక ఏటా వ‌చ్చే బ్ర‌హ్మోత్స‌వాలు, ర‌థ‌స‌ప్త‌మి వంటి ప‌ర్వ‌దినాల‌లో త‌న త‌మ్ముని ఆల‌యానికి దీటుగా సంద‌డిగా మారుతుంది.

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet