తిరుమల భక్తులకు తెలియ వలసిన కొన్ని విషయాలు


తిరుమల బస్టాండు

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే బస్సుల కోసం తిరుపతిలో నాలుగు బస్టాండ్లు ఉన్నాయి. మొదటిది రైల్వే స్టేషను ఎదురుగా ఉండే శ్రీ వేంకటేశ్వర బస్స్టేషను. రైళ్లు వచ్చే సమయానికి అక్కణ్నుంచి తిరుమలకు వెళ్లే బస్సులు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంటాయి. బెంగుళూరు వైపు నుంచి వచ్చే బస్సులు సరాసరి అలిపిరి టోల్గేటు వద్ద ఉండే బాలాజీ లింక్ బస్స్టేషనుకు వస్తాయి. టూరిస్టు వాహనాలు నిలుపుకోవడానికి అక్కడ విశాలమైన ప్రదేశం ఉంది. చెన్నై, హైదరాబాదు, విజయవాడ నగరాల నుంచి వచ్చే బస్సులు సప్తగిరి లింక్ బస్స్టేషను (పెద్ద బస్టాండ్)కు చేరుకుంటాయి. బృందాలుగా ప్రైవేటు వాహనాల్లో వచ్చే పర్యాటకుల కోసం రైల్వేస్టేషను వెనకవైపు శ్రీ పద్మావతీ బస్స్టేషను ఉంది. వీటిలో ఎక్కడ దిగినా సమీపంలోనే సుదర్శనం కౌంటర్లు ఉంటాయి.

రైలు మార్గం

తిరుమలకు దగ్గరి లోని రైల్వే స్టేషను తిరుపతి. తిరుపతి స్టేషనుకు దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుండి రైళ్ళు నడుస్తాయి. రైల్వేస్టేషను నుంచి కొండమీదకు ఆర్టీసీ దాదాపు నిమిషానికో బస్సు నడుపుతోంది. ముందుగానే దర్శన టిక్కెట్లు, కాటేజీ వసతి రిజర్వు చేయించుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన పనిలేదు. స్టేషను నుంచి బయటకు వచ్చి సరాసరి కొండమీదకు వెళ్లిపోవచ్చు.

విమాన మార్గం

తిరుపతికి సమీపాన ఉన్న రేణిగుంట, తిరుమలకు అతి దగ్గరి విమానాశ్రయం. ఇక్కడికి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాదు నుండి నేరుగా విమాన సేవలు ఉన్నాయి. Distance 32 Km to తిరుమలకు విజయవాడ, హైదరాబాద్,బెంగుళూరు,విశాఖపట్నం,చెన్నై నుంచి రోజు Flight Service కలదు


తిరుపతి లడ్డు


telugu-tirumala

తిరుపతి లడ్డు తిరుపతి వెళ్లి వచ్చాము అనగానే ఎవరైనా మొదటగా అడిగేది లడ్డు ఉచిత దర్శనం కి వెళ్లే వాళ్లకు Rs.10 చొప్పున 2 లడ్డులు ఇస్తారు Rs.50, Rs. 300 దర్శనం కి వెళ్లే వాళ్లకు టికెట్ నిబంధన కింద 2 లడ్డులు ఇస్తారు


శ్రీకాళహస్తీశ్వర దేవస్థానము, శ్రీకాళహస్తి

tirpati-tirumala

ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలనుసందర్శించవచ్చు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. తిరుపతి నుంచి 40 కిలోమీటరుల దూరంలో కలదు,RTC Buses ఎల్లవేళలా తిరుగుతూనే ఉంటాయి

aNDHRA-TOURS




స్వర్ణ దేవాలయం, శ్రీపురం


tirumala

తిరుపతి నుండి 120KM దూరము లో కలదు, శ్రీపురం చేరుకోవటానికి RTC సౌకర్యం కలదు.ఇటీవలే నిర్మించిన స్వర్ణ దేవాలయం. తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు కు దగ్గర్లో మలైకుడి అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది.
ఆయన్ను శక్తి సిద్ధ అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆలయం 55000 చదరపు అడుగుల వైశాల్యం లోనిర్మించబడింది. దీని గర్భగుడి సుమారు 1.5 మెట్రిక్ టన్నుల అసలుసిసలైన బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉండటం చేతనే దీనికి బంగారు గుడి అని పేరు వచ్చింది

Tirumala-Telugu

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet