Alipiri మెట్లదారి - తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత "కాలినడక"!

Alipiri-tirumala

తిరుపతి నుండి పైన కొండలమీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది, భక్తులు ఈ అలిపిరి దారిగుండా వెళ్ళి స్వామి వారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు। ప్రస్తుతం మాత్రం రెండు ఎక్కువ వినియోగంలో ఉన్నాయి
రూమ్ వసతి, సేవలు, స్పెషల్ దర్శనం కొరకు ఈ వెబ్సైటును సంప్రతించండి TTD : https://ttdsevaonline.com


Alipiri-tirumala

అలిపిరి కాలిబాట: ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం చాలా మంది భక్తులు కష్టసాధ్యమైన ఏడు కొండలూ దాటితే తమ కోరికలు తీరతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుండి మొదలవుతుంది

(తితిదే) వారు దీన్ని బాగా అభివృద్ధి చేయటం. బస్సు ద్వారా గాని, రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తరువాత, అక్కడి నుండి తితిదే వారు నడుపుతున్న ఉచిత బస్సు / ఆటో / ప్రయివేటు బస్సు / టాక్సీ / జీపు ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. అక్కడ కర్పూరాలు కొని (ఏడు కొండలకు ఏడు అని అమ్ముతుంటారు), దారి మొదట్లో ఉన్న "వేంకటేశ్వరుని పాదాల గుడి" దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయస్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. ఈ మెట్లదారి సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాలిబాటన వచ్చేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తొందరగా దైవదర్శనం అయ్యే విధానాన్ని అమలు చేసారు. మీరు ఎపుడైనా తిరుపతికి కాలినడకన వెళ్ళారా. మీరు తిరుపతికి కాలినడకన వెళితే ఈ సారి తప్పక వేకువజామున 3 నుంచి 5 గంటల మధ్య నడిచి వెళ్ళండి. ఎందుకంటె ఆ సమయములో శ్రీ వారిని పూజించడానికి గంధర్వ బ్రహ్మాది దేవతలు ఏడుకొండల లోని దివ్యమైన వృక్షాలనుంచి అదృశ్య పూలను కోసుకొని తీసుకెళ్తుంటారంట అప్పుడు మనకు ఆ పూల దివ్యమైన సుగంధ పరిమళ వాసన వస్తుంది. ఆ అనుభూతి అనిర్వచనీయము. ఇది వర్ణించరానిది. ఇది ఇప్పటికి ఉంది. అందుకే మీరు ఈ సారి తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా వేకువజామున వెళ్ళండి. ఓం నమో వెంకటేశాయ.
Alipiri-tirumala మొదటిసారి నడవాలి అని అనుకునేవారికి కొన్ని సలహాలు:
నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు. సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపము వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి. Alipiri-tirumala మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంతవరకు గ్లూకోసు, నీళ్లు - వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు(కోక్,పెప్సీ మొ.) ఏ విధంగానూ మన నడకకు సహకరించవు. నామాల కొండ వద్ద తొందరగా దైవదర్శనం అయ్యేందుకు ఇస్తున్న రశీదు తీసుకోవడం మరచిపోవద్దు. ఆ తరువాత కొంత దూరం నడిచినాక మళ్ళీ ఆ రశీదు మీద ముద్ర వేయించుకోవడం మరచిపోవద్దు. లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజిని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత రవాణా సేవలో పైకి పంపించండి.

Alipiri-tirumala

Online లో బుక్ చేసుకున్నవారు మీ ఆధార్ కార్డు లేదా గుర్తింపు కార్డు నెంబర్ ఎంటర్ చేసి ఆ ప్రింట్ తీసుకొని వెలితే మంచిది

శ్రీవారి మెట్టు కాలిబాట:

తిరుమల చేరుకోవడానికి ఇది రెండవ కాలిబాట. తిరుమల పట్టణానికి కళ్యాణీ డ్యాము నీటి సరఫరాకి ఈ మార్గం నుండి పైపులైను వేసిన తరువాత నుండి ఈ దారి కొంత అభివృద్ధి చెందింది. అలాగే తితిదే వారు ఈ కాలిబాటను కూడా బాగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికీ, అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఈ కాలిబాటలో సమస్య ఏమిటంటే దీనికి చేరుకోవడానికి రవాణా సౌకర్యాలు తక్కువగా ఉండేవి.కాని తిరుమల తిరుపతి దేవస్తానము వారు తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు.ఈ దారిలో వేళ్ళేవారికి తిరుమల తిరుపతి దేవస్తానం వారు దివ్యదర్శనానికి టోకను మంజూరు చేస్తున్నారు,దారి పొడవునా నీటి కుళాయిలను వుంచారు,అలిపిరి లాగా మెట్టు దారి లాగా పైకప్పును కూడా యేర్పాటుచేసారు. ఈ దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది.

ఓ తండ్రి శ్రీవేంకటేశ్వర స్వామి ! నీవు శ్రీమంతుడవు, దయాసముద్రుడవు,
అన్ని లోకములకూ కర్తవు, సర్వము తెలిసినవాడవు,
సమర్థుడవు. నమస్కరించువారియెడ వాత్సల్యం చూపేవాడవు.ఈ చేత నాచేతన రూపమగు ప్రపంచంలో నీవే ప్రధానుడవు. మంచి స్వభావము గలవారికి సులభుడవు. ఆశ్రీతులకు పారిజాతము వంటి వాడవు. ఓ దేవా! నీ పాదాలే శరణమని ఆశ్రయిస్తున్నాను

govindarajulu-tirumala


govindarajulu-tirumala

శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్ర మార్గము - శ్రీ వారి మెట్లు
శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడిన తరువాత వారు ఈ దారిగుండానే తిరుమల చేరుకున్నారు .
తిరుమలకు ఇది అతి పురాతన నడకదారి.
ఒకప్పుడు చంద్రగిరి నుండి తిరుమలకు రాకపోకలన్నీ ఈదారి గుండానే జరిగేవి .
శ్రీ కృష్ణ దేవరాయలు , అన్నమయ్య తదీతర మహా భక్తులు ఎందరో ఈ దారి గుండానే తిరుమలకు వెళ్లి స్వామి వార్ని దర్శించుకున్నారని ప్రతీతి.
తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి. అలిపిరి నుండి వేళ్ళే దారి అందరికీ పరిచయమైనది. ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది. తిరుమల చేరుకోవడానికి రెండవ కాలిబాట '''శ్రీవారి మెట్టు''' నుండి ఉంది. ఈ మార్గంలో ప్రయాణం ఒక గంట మాత్రమే పడుతుంది.
తిరుమల బస్సు స్టాండ్ నుంచి శ్రీ వారి మెట్టుకు ఉచిత బస్సు కలవు . అలిపిరిలో ఉన్నట్లు గానే ఇక్కడకూడా ఉచిత లగేజి కౌంటర్ ఉంది .
మెట్ల మార్గం గుండా నడిచేవెళ్ళే వాళ్ళు తమ బాగ్ లను ఇక్కడ ఉంచితె.. దేవస్థానం వాళ్ళు కొండపైకి తీస్కుని వెళ్తారు . ఇక్కడ నుంచి మెట్ల మార్గం 6 km ఉంటుంది .
శ్రీ వారి మెట్టు ద్వారా నడక మార్గమున తిరుమలకు వెళ్ళు భక్తులను ఉదయం 6 గం ॥ల నుండి సాయంత్రం 6 గం ॥ల వరకు అనుమతించబడును . కనుక సమయ పాలన అతి ముఖ్యం.ఏమాత్రం ఆలస్యం చేసినా మరో రోజువరకు వేచి ఉండాలి.కనుక ఉన్న సమయానికి తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని సన్నధం కావాలి.
నడక ప్రారంభించే ముందు . స్వామి వారి ప్రసాదం తీస్కోండి
స్వామి వారి పదాలకు నమస్కరించుకుని గోవింద నామాలు స్మరిస్తూ నడక యాత్ర ప్రారంభించాలి
ఏడుకొండల వాడా ఆపద మొక్కుల వాడా అనాధ రక్షక వెంకటరమణా గోవిందా గోవిందా
అల్లిపిరిలో తిరుమల నడిచి వచ్చే వాళ్ళకు టోకెన్ లు ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇస్తారు . ఎందుకంటే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆలస్యం ఐతే టోకెన్ ఇవ్వరు .
ప్రతి రోజు శ్రీ వారి మెట్టు 3750 టోకెన్లు మరియు అలిపిరి 11,250 టోకెన్లు నడక మార్గం ద్వారా నడిచి వచ్చే భక్తులకు 15,000 టోకెన్లు లేదా సాయంత్రం 5.00 గం ॥ల వరకు మాత్రమే జారిచేయబడును
టోకెన్లు కోటా పూర్తీ అయిన లేదా సమయం ముగిసిన యెడల కౌంటర్లు ముసివేయబడును . కావున భక్తులు గమనించ ప్రార్ధన .
సుమారు 300 -400 మెట్లు వరకు చాల సులభంగ ఎక్కవచ్చు ..
గోవింద నామాలు చదువుకుంటూ .. గోపాలుడుని స్మరించుకుంటూ .. నడక సాగించండి
దివ్య దర్శనం టోకెన్ టికెట్ మరో 900 మెట్ల దూరం లో ఉంది .. గోవిందా గోవిందా
శ్రీ వారి మెట్టు కాలినడక వచ్చు భక్తులు లగేజి కౌంటర్ M. P.C కి ఎదురుగ ఉన్న బిల్డింగ్ లో తీస్కోవచ్చు .
ఒక్కోసారి బ్యాగ్ లు రావడం లేట్ అవుతుంది ..బ్యాగ్ లు వచ్చే లోపు .. స్వామి వారి అన్నదాన ప్రసాదం స్వికరించండి . ఇక్కడకి దగ్గరలోనే S.V.అన్నదాన భోజనశాల ఉంది.
తిరుమల లో అంగప్రదిక్షణ చేయదలచుకున్న భక్తులు ఇవి తెలుసుకోవాలి
వేంకటేశ్వరునికి సుప్రబాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అనుభూతిని ఎలా వర్ణిస్తాం .
1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి వారి కొండ .. తిరుపతి అంటే క్రింద ఉన్న ఉరు ) ఉన్న C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగప్రదిక్షణ టికెట్స్ ఇస్తారు .
2. అంగప్రదిక్షణ టికెట్స్ ముందుగ వచ్చిన 700 మందికి మాత్రమే ఇస్తారు . అంగప్రదిక్షణ స్త్రీలు , పురుషులు ఇద్దరు చేయవచ్చు . మరీ చిన్నపిల్లలకి టికెట్స్ ఇవ్వరనుకుంట .
3. 1.30 లోపు సుఫదం దగ్గరకు మీరు రవాలని మీకు ఇచ్చిన టికెట్ మీద ఉంటుంది . మీరు 1am లోపే అక్కడ ఉండండి .
4. స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతోనే సుపధం దగ్గరకు వెళ్ళాలి ( సుపధం అంటే స్వామి వారి గుడి కుడివైపు న ఉంటుంది . అక్కడ ఎవరైనా చెబుతారు .
5. అంగప్రదిక్షణ టికెట్స్ ఉచితంగానే ఇస్తారు . మీరు టికట్ కి మధ్యాహ్నం 12 గంటలకు నిలబడితే మీకు టికెట్ దొరికే ఛాన్స్ ఉంది .
6. అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు ( 10/-) . మీరు డబ్బులు కూడా తీస్కుని వెళ్ళండి .
7. దర్శనం చాల త్వరగా అవుతుంది . అంగప్రదిక్షణ అయినతరువాత మీకు స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది .
8. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ఉంటే మంచిది . మామోలు ప్యాంట్ కూడా అనుమతినిస్తున్నారు . బనియన్ ఉంచుకోకూడదు . ముందుగా స్త్రీలను తరువాత పురుషులను అంగప్రదిక్షణ చేయిస్తారు .
9.స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడనుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదిక్షణ చేస్తాం . ఇవి మీ అందర్కి నేను చెప్పాలనే కాబోలు నాకేమి తేలియక పోయిన స్వామి వారు నాచేత అంగప్రదిక్షణ చేయించారు . గోవింద గోవిందా ..
అందరూ మనస్పూర్తిగా స్వామి వారి అనుగ్రహం కొరకు భక్తితో మరొక్క సారి స్మరించండి ...
ఏడుకొండల వాడా ఆపద మొక్కుల వాడా అనాధ రక్షక వెంకటరమణా గోవిందా గోవిందా.......FOLLOW US FB 74K FOLLOWED

శ్రీ గోవిందరాజ స్వామి

keywords : tirumala live status for dharshan queue, tirumala crowd status live, today tirumala dharshan live status, waiting time in tirumala for sarva dharshan, తిరుమల తిరుపతి live update, Tirumala Darshan crowd today. Tirumala darshan by walk rush today. Tirumala samacharam today", "TTD live status", Tirumala Crowd Status, tirumala update, tirumala status, today tirumala live darshan

govindarajulu-tirumala

govindarajulu-tirumala

govindarajulu-tirumala

govindarajulu-tirumala

govindarajulu-tirumala

govindarajulu-tirumala

govindarajulu-tirumala
lauging-best-health

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

ESHA-AMBANI-HOME-MUMBAI

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

gobest-telugu-website

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

gobest-telugu

తోటకూర కమ్మకమ్మగా..!తోటకూరతో చాలా లాభాలున్నాయి.

ayurvedam-natu-vaidyam-best-tips-at-gobest-telugu-website

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

kajal-agarwal-beautiful-images-photos

కాజల్ అగర్వాల్ 50 Photos

gobest

ఆయుర్వేదం - 100 చిట్కాలు (నాటు వైద్యం)

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet