Gobest.in: పన్నెండేళ్లలో పన్నెండుతో తొలిసారి SRH

 



పన్నెండేళ్లలో పన్నెండుతో తొలిసారి..
అతి తక్కువ పాయింట్లతో ప్లేఆఫ్స్‌ చేరిన జట్టుగా సన్‌రైజర్స్‌ రికార్డు

Hyderabad

ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్‌ 12వ సీజన్‌ ప్లేఆఫ్స్‌ ఆడబోయే నాలుగో జట్టేదో తేలిపోయింది. ఆ అవకాశం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు దక్కింది. ఆ జట్టు ఆరు విజయాలతోనే బెర్తు సంపాదించడం విశేషం. ఐపీఎల్‌ చరిత్రలోనే అతి తక్కువ పాయింట్లతో (12) ప్లేఆఫ్స్‌కు చేరిన జట్టు హైదరాబాదే. ఇప్పటిదాకా కనిష్టంగా 14 పాయింట్లతోనే జట్లు ముందంజ వేశాయి. లీగ్‌ దశ చివరి మ్యాచ్‌లో కోల్‌కతా.. ముంబయి చేతిలో ఓడిపోవడంతో సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్స్‌లో స్థానం దక్కింది. సన్‌రైజర్స్‌తో పాటు కోల్‌కతా, పంజాబ్‌ సైతం 12 పాయింట్లతో సమానంగా నిలిచాయి. ఐతే నెట్‌రన్‌రేట్‌ (+0.577) మెరుగ్గా ఉండటంతో సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్స్‌ బెర్తు దక్కించుకుంది. కోల్‌కతా (+0.028), పంజాబ్‌ (-0.251)లకు నిరాశ తప్పలేదు. ఇక కోల్‌కతాను ఓడించిన ముంబయి 18 పాయింట్లతో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. చెన్నై, దిల్లీ కూడా అన్నే పాయింట్లు సాధించినప్పటికీ.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌ (+0.421)తో వాటిని ముంబయి వెనక్కి నెట్టింది. చివరి మ్యాచ్‌లో పంజాబ్‌ చేతిలో ఓడినప్పటికీ.. దిల్లీ (+0.044) కంటే నెట్‌రన్‌రేట్‌ ఎక్కువ ఉన్న చెన్నై (+0.131) రెండో స్థానం సాధించింది. లీగ్‌ దశలో టాప్‌-2లో ఉన్న జట్లకు ప్లేఆఫ్స్‌ దశలో అదనపు అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే.




Ipl dhoni

FOLLOW US FB 77K FOLLOWED




వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet