పంజాబ్‌ పాంచ్‌ పటాకా
కింగ్స్‌ ఎలెవన్‌కు ఐదో విజయం రాజస్థాన్‌కు ఆరో పరాజయం

ipl

ఈసారి ఐపీఎల్‌లో అట్టడుగు స్థానానికి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో గట్టిగానే పోటీ పడుతోంది రాజస్థాన్‌ రాయల్స్‌. బెంగళూరు 8 మ్యాచ్‌ల్లో ఏడు ఓడిపోతే.. రాయల్స్‌ అన్నే మ్యాచ్‌లు ఆడి ఆరో ఓటమి ఖాతాలో వేసుకుంది. మంగళవారం ఆ జట్టు.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ చేతిలో ఓటమి చవిచూసింది. రెండు వరుస ఓటముల తర్వాత పుంజుకున్న పంజాబ్‌.. మళ్లీ గెలుపు బాట పట్టింది. ఐదో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. బ్యాటింగ్‌లో మెరుపులతో పాటు బౌలింగ్‌లోనూ చక్కటి ప్రదర్శన చేసిన అశ్విన్‌.. కెప్టెన్‌గానూ సత్తా చాటుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ పుంజుకుంది. ప్లేఆఫ్‌ రేసులో వెనుకబడుతున్న దశలో కీలక విజయం సాధించింది. మంగళవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో అశ్విన్‌ సేన 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్‌.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 170 పరుగులే చేసింది. రాహుల్‌ త్రిపాఠి (50; 45 బంతుల్లో 4×4) టాప్‌స్కోరర్‌. రవిచంద్రన్‌ అశ్విన్‌ (2/24), మురుగన్‌ అశ్విన్‌ (1/24) ప్రత్యర్థికి కళ్లెం వేశారు. అంతకుముందు పంజాబ్‌ 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (52; 47 బంతుల్లో 3×4, 2×6), డేవిడ్‌ మిల్లర్‌ (40; 27 బంతుల్లో 2×4, 2×6) రాణించారు. ఆఖర్లో అశ్విన్‌ (17 నాటౌట్‌; 4 బంతుల్లో 1×4, 2×6) మెరుపులే ఇరు జట్ల మధ్య తేడాగా నిలవడం గమనార్హం. బౌలింగ్‌ మార్పులు, ఫీల్డింగ్‌ ఏర్పాట్లలో తెలివిగా వ్యవహరించి కెప్టెన్‌గానూ పంజాబ్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్‌నే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. FOLLOW US FB 74K FOLLOWED

ipl

gobest

మంచి స్థితిలోనే ఉన్నా..: ఛేదనలో చాలా వరకు రాయల్స్‌ పోటీలోనే ఉంది. తొలి నలుగురు బ్యాట్స్‌మెన్‌ చెప్పుకోదగ్గ స్కోర్లే చేశారు. కానీ బట్లర్‌ (23), శాంసన్‌ (27) మంచి ఆరంభాల్ని సద్వినియోగం చేసుకోలేదు. పరుగుల వేగం ఆశించిన స్థాయిలో లేకపోవడం రాయల్స్‌ను దెబ్బ తీసింది. ఒక దశలో స్కోరు 127/2. కానీ అప్పటికే 15.5 ఓవర్లు అయిపోయాయి. అప్పుడే త్రిపాఠి ఔటైపోయాడు. దీంతో చివరి 4 ఓవర్లలో 56 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దశలో మెరుపులు మెరిపిస్తారనుకున్న టర్నర్‌ (0), ఆర్చర్‌ (1) ఇలా వచ్చి అలా వెనుదిరిగారు. చివర్లో బిన్నీ (33 నాటౌట్‌; 11 బంతుల్లో 2×4, 3×6) ధాటిగా ఆడాడు కానీ.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. అతడి మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించాయంతే.

ipl

అశ్విన్‌ అనూహ్యంగా..: అంతకుముందు పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ ఇన్నింగ్సే కొసమెరుపు. అతను ఆడింది 4 బంతులే. కానీ ఆ నాలుగు బంతుల్లోనే మూడు మెరుపు షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు అశ్విన్‌. అతను బాదిన రెండు సిక్సర్లూ కళ్లు చెదిరిపోయేలా చేసినవే. ఇలాంటి బ్యాట్స్‌మన్‌ ఇంత దిగువన వస్తున్నాడేంటి అనిపించేలా చివరి ఓవర్లో చెలరేగాడు అశ్విన్‌. అతడి ధాటికి ధవళ్‌ కులకర్ణి వేసిన చివరి ఓవర్లో 18 పరుగులు చేసిన పంజాబ్‌.. అనుకున్న దాని కంటే మెరుగైన స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది. అంతకుముందు పంజాబ్‌ ఇన్నింగ్స్‌ ఒడుదొడుకులతో సాగింది. 13 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 97/2. తన శైలికి భిన్నంగా ఆడిన కేఎల్‌ రాహుల్‌ అప్పటికి 32 బంతుల్లో 25 పరుగులే చేశాడు. అతను ఆరంభం నుంచి చాలా నెమ్మదిగా ఆడాడు. గేల్‌ (30; 22 బంతుల్లో 2×4, 3×6) మంచి ఊపుమీదున్న సమయంలో ఔటైపోయాడు. మయాంక్‌ (26; 16 బంతుల్లో 1×4, 2×6) కూడా అంతే. ఆ తర్వాత రాహుల్‌, మిల్లర్‌ నెమ్మదిగా ఆడటంతో స్కోరు వేగం పుంజుకోలేదు. ఐతే 14, 15 ఓవర్లలో వీళ్లిద్దరూ చెలరేగడంతో 39 పరుగులొచ్చాయి. ఐతే చివరి ఓవర్లలో రాయల్స్‌ బౌలర్లు చక్కటి ప్రదర్శన చేశారు. 12 పరుగుల తేడాలో నాలుగు వికెట్లు పడగొట్టారు. దీంతో పంజాబ్‌ 152/2 నుంచి 164/6కు చేరుకుంది. ఐతే అశ్విన్‌ చివరి ఓవర్‌ మెరుపులు జట్టుకు మంచి స్కోరునందించాయి.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) ఆర్చర్‌ (బి) ఉనద్కత్‌ 52; గేల్‌ (సి) శాంసన్‌ (బి) ఆర్చర్‌ 30; మయాంక్‌ (సి) ఆర్చర్‌ (బి) సోధి 26; మిల్లర్‌ (సి) బట్లర్‌ (బి) ధవళ్‌ 40; పూరన్‌ (సి) రహానె (బి) ఆర్చర్‌ 5; మన్‌దీప్‌ (బి) ఆర్చర్‌ 0; అశ్విన్‌ నాటౌట్‌ 17; ముజీబ్‌ రెహ్మాన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 12 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182; వికెట్ల పతనం: 1-38, 2-67, 3-152, 4-163, 5-164, 6-164 బౌలింగ్‌: ధవళ్‌ కులకర్ణి 4-0-37-1; ఉనద్కత్‌ 4-0-48-1; ఆర్చర్‌ 4-0-15-3; ఇష్‌ సోధి 4-0-41-1; శ్రేయస్‌ గోపాల్‌ 4-0-31-0

రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: త్రిపాఠి (సి) మయాంక్‌ (బి) రవిచంద్రన్‌ అశ్విన్‌ 50; బట్లర్‌ (సి) పూరన్‌ (బి) అర్ష్‌దీప్‌సింగ్‌ 23; శాంసన్‌ (బి) రవిచంద్రన్‌ అశ్విన్‌ 27; రహానె (సి) షమి (బి) అర్ష్‌దీప్‌సింగ్‌ 26; టర్నర్‌ (సి) మిల్లర్‌ (బి) మురుగన్‌ అశ్విన్‌ 0; ఆర్చర్‌ (సి) రాహుల్‌ (బి) షమి 1; బిన్నీ నాటౌట్‌ 33; గోపాల్‌ (సి) మయాంక్‌ (బి) షమి 0; ఉనద్కత్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 170; వికెట్ల పతనం: 1-38, 2-97, 3-127, 4-131, 5-133, 6-148, 7-160; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌సింగ్‌ 4-0-43-2; ముజీబ్‌ రెహ్మాన్‌ 3-0-24-0; మురుగన్‌ అశ్విన్‌ 4-0-24-1; రవిచంద్రన్‌ అశ్విన్‌ 4-0-24-2; షమి 4-0-46-2; మన్‌దీప్‌సింగ్‌ 1-0-8-0

ipl-2019-gobest

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

మహేష్‌బాబు మైనపు విగ్రహాన్ని చూసి మురిసిపోతున్న కుటుంబ సభ్యులు

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

jayasudha

వల్గర్ కామెడీ షోలో నేనా? డబ్బుకు కక్కుర్తి పడకుండా.. నిర్వాహకులకు జయసుధ షాక్

మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ఇన్‌స్టా ఇలా అన్ని మాధ్యమాలను కవర్ చేస్తూ అభిమానులను ఎం

తిరుపతి వెళుతున్నారా అయితే మీకోసం..

rashmika-vijay

మా మధ్య అలాంటిదేమీ లేదు.. ఎక్కువగా ఊహించుకోవద్దు.. విజయ్ దేవరకొండతో లిప్‌లాక్‌పై రష్మిక

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet