Gobest.in: ఆ నాలుగు జ‌ట్లకూ ప్లేఆఫ్‌ ప్రయాణమిది!

 ఆ నాలుగు జ‌ట్లకూ ప్లేఆఫ్‌ ప్రయాణమిది!


ధోనీ ధనాధన్‌.. వార్నర్‌ విధ్వంసం.. రసెల్‌, హార్దిక్‌ పోటాపోటీ బాదుడుతో మొత్తానికి ఐపీఎల్‌ 12 ప్లేఆఫ్స్‌కు ముందే అభిమానులకు సిసలైన టీ20 మజా దొరికింది. ఎప్పటిలాగే చెన్నై, ముంబయి దర్జాగా లీగ్‌ దశలో ముందు వరుసలో నిలవగా పేరుతో పాటు తమ తల రాతనూ మార్చుకున్న దిల్లీ చాలా కాలం తర్వాత ప్లేఆఫ్స్‌ గడప తొక్కింది. ఆరంభంలో సునాయాసంగా విజయ దుందుభి మోగించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివర్లో తడబడినా ముంబయితో మ్యాచ్‌లో కోల్‌కతా ఓడిపోవడంతో అదృష్టం కలిసొచ్చి లీగ్‌దశ దాటేసింది. ఇక ముందుంది అసలు పోరు. టైటిల్‌ వేటలో ముందడుగు వేసిన ఈ నాలుగు జట్లు లీగ్ దశను ఎలా దాటాయో ఓ సారి చూద్దాం.


Sri lanka Bomb

మురిసిన ముంబయి..

స్టార్‌ ఆటగాళ్లు, ప్రతిభావంతులైన కుర్రాళ్లు, తిరుగులేని కోచింగ్‌ బృందం. ఇలా ఏ విషయంలోనూ లోటు లేని ముంబయి అదే జోరుతో మరోసారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. టోర్నీని ఓటమితో ఆరంభించినా గతేడాదిలా ఈ సారి మాత్రం లీగ్‌ దశలో తడబడలేదు. డికాక్‌, రోహిత్‌ ఇద్దరూ చాలా మ్యాచ్‌ల్లో జట్టుకు శుభారంభాలు ఇచ్చారు. ఒక్కోసారి రోహిత్‌ తక్కువ పరుగులకే వెనుదిరిగినా డికాక్‌ మాత్రం దూకుడు కొనసాగించాడు. ముంబయి విజయాల్లో మిడిలార్డర్‌ది కీలకపాత్ర. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ఈసారి చెలరేగి ఆడాడు. తాను జట్టుకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అని నిరూపించాడు. ఏటా ఓ కొత్త దేశవాళీ కుర్రాడిని వెలుగులోకి తీసుకరావడం ముంబయి ప్రత్యేకత. ఈ సీజన్‌లోనూ రాహుల్‌ చాహర్‌ రూపంలో ఓ నాణ్యమైన స్పిన్నర్ దొరికాడు. ఇక డెత్ ఓవర్‌ స్పెషలిస్ట్‌ బుమ్రా, మలింగతో పాటు పాండ్య సోదరులు బంతితోనూ సత్తా చాటడంతో ముంబయి ప్లేఆఫ్‌కు చేరుకుంది. మిగతా మ్యాచ్‌ల్లోనూ ఇదే సమష్టి పోరాటం సాగిస్తే ఇంకో టైటిల్‌ వచ్చినట్లే. ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లు గెలిచిన ముంబయి 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దిల్లీ, చెన్నైకీ 18 పాయింట్లే వచ్చినా రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో ముందంజ వేసింది. రోహిత్‌సేనలో క్వింటన్‌ డికాక్‌ 492 పరుగులతో అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు. బుమ్రా 17 వికెట్లు పడగొట్టాడు.


Sri lanka Bomb

చితక్కొట్టిన చెన్నై

సీఎస్‌కే బలం.. బలహీనత రెండూ సారథి ధోనీనే. అతను మైదానంలో ఉంటే విజయం. లేకుంటే పరాజయం అన్నట్టే సాగింది చెన్నై ప్రయాణం. మహేంద్రుడి మాయాజాలం ఆర్‌సీబీతో జరిగిన తొలి మ్యాచ్‌తోనే మొదలైంది. కోహ్లీ, ఏబీడీతో కూడిన అత్యుత్తమ బ్యాటింగ్‌ లైనప్‌నూ కేవలం 70 పరుగులకే పరిమితం చేసి తన వ్యూహాలకు పదును పెడుతూ వచ్చాడు ధోనీ. మరోవైపు టాప్‌ ఆర్డర్‌ తక్కువ పరుగులకే వెనుదిరిగినా.. విదేశీ బ్యాట్స్‌మెన్‌ నిరాశ పరిచినా.. ఈ బెస్ట్‌ ఫినిషర్‌ మాత్రం ఎక్కడా తడబడలేదు. అనారోగ్యంతో ఒకటి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయినా తిరిగి కోలుకోని జట్టులో వందశాతం స్ఫూర్తి నింపాడు. మరోవైపు బౌలింగ్‌లో వెటరన్‌ స్పిన్‌ దళంతో అద్భుతాలే సృష్టించాడు ఈ కూల్‌ కెప్టెన్‌. తాహీర్‌, భజ్జీ, జడ్డూతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ దూకుడుకు వికెట్ల వెనుక తనకున్న అపార అనుభవంతో కళ్లెం వేశాడు. ఇలా అన్నీ తానే అయి నిలిచిన తలైవా సీఎస్‌కేను మరోసారి సునాయాసంగా ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ఆ తర్వాత కూడా ధోనీ తన అమ్ములపొదిలోని మరి కొన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటే చెన్నై ఖాతాలో నాలుగో టైటిల్‌ పడినట్టే. అయితే సొంతమైదానంలో సింహంలా కనిపిస్తున్న ఆ జట్టును తెలివిగా ఆడితే ఓడించొచ్చు. ఓటములు చెబుతున్న పాఠం ఇది. లీగ్‌లో 9 విజయాలతో 18 పాయింట్లు సాధించింది. ముంబయి కన్నా నెట్‌ రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది. చెన్నైలో అత్యధిక పరుగులు వీరుడు మహీ (368)నే. ఇమ్రాన్‌ తాహీర్‌ తీసిన 21 వికెట్లు తీసి కీలకంగా నిలిచాడు..

Sri lanka Bomb

దూకుడుగా దిల్లీ..

గత సీజన్‌ వరకూ ఐపీఎల్‌ చరిత్రలో పేలవ ప్రదర్శనకు కేరాఫ్‌ అడ్రస్‌ దిల్లీ. ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రతి సీజన్‌కు దిల్లీ పరిస్థితి దిగజారిపోతూ వచ్చేది. ఈ సారి మాత్రం ఏకంగా పేరునే మార్చుకొని దిల్లీ క్యాపిటల్స్‌ అంటూ యువ జోరుతో చెలరేగిపోయింది. తొలి మ్యాచ్‌లో గెలిచి వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడటంతో మళ్లీ పాత కథే పునరావృతం అవుతుందేమో అనుకున్నరంతా. కానీ ఆ తర్వాతి నుంచి ఫుల్‌ జోష్‌తో విజయాల బాట పట్టింది దిల్లీ. అనుభజ్ఞుడైన ధావన్‌ రాకతో కుర్ర జట్టు రెట్టింపు ఉత్సాహంతో ఆడింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌, స్టార్‌ హిట్టర్‌ రిషభ్‌ పంత్‌ ఇన్నింగ్‌లే ఇందుకు కారణం. దక్షిణాఫ్రికా పేసర్‌ రబాడ దిల్లీ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించాడు. జట్టు విజయాల్లో అతనిదే కీలక పాత్ర. మోరిస్‌, అక్షర్‌ పటేల్‌ సైతం బంతితో ఆకట్టుకున్నారు.
Sri lanka Bomb

FOLLOW US FB 77K FOLLOWED

అదృష్టంతో సన్‌రైజర్స్‌..

గత సీజన్‌తో పోల్చితే ఈసారి సన్‌రైజర్స్‌ పరిస్థితి పూర్తిగా భిన్నం. నాణ్యమైన బౌలింగ్‌ వనరులతో గతేడాది ఫైనల్‌ చేరిన సన్‌రైజర్స్‌ ఇప్పుడు మాత్రం బ్యాటింగ్‌పైనే ఆధారపడుతూ వచ్చింది. వార్నర్‌-బెయిర్‌ స్టో రాకతో సన్‌రైజర్స్‌ రూపురేఖలే మారిపోయాయి. వీరు టోర్నీ ఆరంభం నుంచి పోటాపోటీగా ఆడుతూ జట్టును ముందుండి నడిపించారు. ఏడాది నిషేధం ఎదుర్కొన్న తర్వాత తిరిగి మైదానంలోకి వచ్చిన వార్నర్ రెచ్చిపోయి మరీ ఆడాడు. కేవలం 12 మ్యాచ్‌ల్లోనే 692 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌ నేపథ్యంలో వీరిద్దరూ స్వదేశానికి చేరుకోవడంతో మనీశ్‌ పాండే జట్టును ముందుండి నడిపించాడు. కానీ ఇప్పుడు అతనికి మిగతా బ్యాట్స్‌మెన్‌ నుంచి తోడ్పాటు లేకపోవడం ఆందోళన కలిగించే అంశమే. బౌలింగ్‌లో స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్‌ ఆకట్టుకున్నారు. భువనేశ్వర్‌ కూడా రాణిస్తే తర్వాత సన్‌రైజర్స్‌కు తిరుగుండదు. నిజానికి సన్‌రైజర్స్‌ ప్లేఆఫ్‌కు చేరుకుంటుందని ఎవరూ అనుకోలేదు. కోల్‌కతా దురదృష్టం హైదరాబాద్‌కు కలిసొచ్చింది. 12 పాయింట్లతో రన్‌రేట్‌ బాగుండటంతో అర్హత సాధించింది. చివరి ఐదు మ్యాచుల్లో విలియమ్సన్‌ సేన నాలుగింట్లో ఓడింది. రెండు మ్యాచుల్లో గెలిచే మ్యాచులను చేజార్చుకుంది. ఇలాగే ఆడితే ఎలిమినేటర్‌-1లోనే దిల్లీ చేతిలో ఓడే ప్రమాదం ఉంది. లీగ్‌ దశలో హైదరాబాద్‌ 6 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా వెళ్లిపోయిన వార్నర్‌ ఇప్పటికీ అత్యధిక పరుగుల వీరుడే. భువి విఫలమయ్యాడు. ఖలీల్‌ అహ్మద్‌ 17 వికెట్లు తీశాడు.

wATSON-ipl-2019


వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet