Gobest.in: IPL Winners ముంబయి ఇండియన్స్‌

 నాలుగోసారి ఐపీఎల్‌ ట్రోఫీ ముంబయి ఇండియన్స్‌దే
నాలుగోసారి ఐపీఎల్‌ ట్రోఫీ కైవసం
ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో చెన్నైపై విజయం
IPL Winners

స్వల్ప స్కోర్లే నమోదైనా ఐపీఎల్‌కు అదిరే ముగింపు. ఆఖరి పంచూ ముంబయి ఇండియన్స్‌దే. ఫైనల్‌ చేరే క్రమంలో మూడుసార్లు చెన్నైని మట్టికరిపించిన ముంబయి.. ఆఖరి పోరాటంలోనూ పైచేయి సాధించింది. ఉప్పల్‌ను ఉత్కంఠతో ఊపేసి, ఉద్వేగాలను పెంచేసి, ఆఖరి బంతి వరకూ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టిన ఫైనల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించిన ముంబయి.. నాలుగోసారి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది. అత్యధికసార్లు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టుగా అవతరించింది. కడ బంతి వరకు విజయం దోబూచులాడిన పోరులో బుమ్రా, రాహుల్‌ చాహర్‌ల అద్భుత బౌలింగ్‌ ముంబయిని గెలిపిస్తే.. వాట్సన్‌ పోరాటం వృథా మిగిలిపోయింది.


Sri lanka Bomb

మురిసిన ముంబయి..

ఈ టైటిల్‌ ముంబయి ‘రెండేళ్ల ఆనవాయితీ’ కొనసాగినట్లయింది. 2013, 2015, 2017లో విజేతగా నిలిచిన ముంబయి.. ఇప్పుడు ఐపీఎల్‌-12లోనూ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా అవతరించింది. ముంబయి 2017 ఫైనల్లోనూ ఇదే ఉప్పల్‌ స్టేడియంలో ఒక్క పరుగు తేడాతో నెగ్గడం విశేషం. 2009లో డెక్కన్‌ ఛార్జర్స్‌ తరఫున కప్‌ అందుకున్న రోహిత్‌శర్మ.. ఐదోసారి ఐపీఎల్‌ ట్రోఫీ అందుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.


Sri lanka Bomb

ధోని నాటౌట్‌.. ఔట్‌!:

ఉత్కంఠ పతాక స్థాయికి వెళ్లిన పోరులో అంతిమ విజయం ముంబయిదే. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌-12 ఫైనల్లో ముంబయి ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కీరన్‌ పొలార్డ్‌ (41 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 3×6) జట్టును ఆదుకున్నాడు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు చేయగలిగింది. ఓపెనర్‌ షేన్‌ వాట్సన్‌ (80; 59 బంతుల్లో 8×4, 4×6) పోరాడినా చివరి మెట్టుపై చతికిలపడ్డాడు. బుమ్రా (2/14), రాహుల్‌ చాహర్‌ (1/14) అద్భుత బౌలింగ్‌తో ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించారు.

Sri lanka Bomb

ధోని నాటౌట్‌.. ఔట్‌!:


Sri lanka Bomb

FOLLOW US FB 77K FOLLOWED

అసలైన హీరో బుమ్రా

చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన మలింగ ముంబయికి హీరోగా నిలిచాడు కానీ.. అంతకుముందు ఆ జట్టును పోటీలో నిలబెట్టింది మాత్రం బుమ్రానే. 4-0-14-2.. ఈ గణాంకాలు చూస్తేనే అతడెలా బౌలింగ్‌ చేశాడో చెప్పేయొచ్చు. ఉత్కంఠలో, ఒత్తిడిలో అతను బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం. మలింగ వేసిన 16వ ఓవర్లో 20 పరుగులు రాబట్టి వాట్సన్‌, బ్రావో ఊపుమీదున్న దశలో బౌలింగ్‌కు వచ్చి కేవలం నాలుగే పరుగులిచ్చాడు బుమ్రా. తర్వాతి ఓవర్లో కృనాల్‌ 20 పరుగులు సమర్పించుకున్నాడు. 2 ఓవర్లలో 18 పరుగులు చేస్తే చాలు. ఆ స్థితిలో బ్రావో వికెట్‌ తీసి 9 పరుగులే ఇచ్చాడు. అందులో ఒక ఫోర్‌ కీపర్‌ డికాక్‌ తప్పిదం వల్ల వచ్చిన బైస్‌ కావడం గమనార్హం.

ముంబయి విజయం జట్టు అందరిది. ఈ టోర్నీలో బౌలర్లు గొప్పగా రాణించారు. కీలక సమయాల్లో సత్తా చాటారు. ఒక ఛాంపియన్‌ బౌలర్‌ ఏం చేయాలో మలింగ అదే చేశాడు. 20 ఓవర్‌ హార్దిక్‌ పాండ్యతో వేయిద్దాం అనుకున్నాం. కానీ గతంలో ఈ స్థితిలో బౌలింగ్‌ చేసిన అనుభవం ఉన్న మలింగ వైపే మళ్లాం’’ - రోహిత్‌

wATSON-ipl-2019


వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet