ఐపీఎల్‌లో హ్యాట్రిక్‌ హీరోలు...బ్యాట్స్‌మెన్‌ బాదుడుకు.. బౌలర్ల దూకుడుకు మారుపేరు ఐపీఎల్‌


IPL

బ్యాట్స్‌మెన్‌ బాదుడుకు.. బౌలర్ల దూకుడుకు మారుపేరు ఐపీఎల్‌. క్రీజులో బ్యాట్స్‌మెన్ ఆకలితో ఉన్న పులుల్లా ఉంటారు. బంతుల్ని బౌండరీలకు తరలించాలని తహతహలాడుతుంటారు. ఫామ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్‌ వేయడం కత్తిమీద సామే. అది స్పిన్నైనా.. స్పీడైనా.. ఏ మాత్రం తేడా వచ్చినా బౌలర్లు చుక్కలు చూడటం ఖాయం. ఐపీఎల్‌ అంటే బ్యాట్స్‌మెన్‌కు తీపి గుర్తులు.. బౌలర్లకు చేదు జ్ఞాపకాలేనా అన్న అనుమానం మీకూ వచ్చిందా..? అలా ఏం కాదండి.. క్రీజులో ఉన్నది ఎంత పెద్ద హిట్టర్‌ అయినా సరే తమ అస్త్రాలతో బ్యాట్స్‌మెన్‌ను మూప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన బౌలర్లూ ఉన్నారు. హ్యాట్రిక్‌ వికెట్లు సాధించి ఐపీఎల్‌ చరిత్రలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వాళ్లెవరో మీకు తెలుసా.. అయితే ఈ కథనం ఓసారి చదివేయండి.. మిశ్రా.. ‘దూస్రా’


లెగ్‌బ్రేక్‌తో పాటు తన దూస్రాలతోనూ బ్యాట్స్‌మెన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తాడు మిశ్రా. 2008లో దిల్లీ డేర్‌డెవిల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన మిశ్రా.. దక్కన్‌ ఛార్జర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రవితేజ, ప్రగ్యాన్‌ ఓజా, ఆర్‌పీ సింగ్‌ను ఔట్‌ చేసి దిల్లీ జట్టుకు 12 పరుగుల విజయాన్ని కట్టబెట్టాడు. ఆ తర్వాత 2013లో హైదరాబాద్‌కు మారిన మిశ్రా.. పుణె వారియర్స్‌ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో మరోసారి హ్యాట్రిక్‌ సాధించాడు. ఆ మ్యాచ్‌లో వరుసగా భువనేశ్వర్‌కుమార్‌, రాహుల్‌ శర్మ, అశోక్‌ దిండాను ఔట్‌ చేసి రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. IPL యువీ ఆల్‌ రౌండ్‌ షో
కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ ఆటగాడు యువరాజ్‌ సింగ్‌ 2009లో ఏకంగా రెండు సార్లు హ్యాట్రిక్‌ సాధించాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ జాక్వెస్‌ కలీస్‌, మార్క్‌ బౌచర్‌, రాబిన్‌ ఉతప్పను ఔట్‌ చేసి సంచలనం సృష్టించాడు. అలా తొలి హ్యాట్రిక్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అయినా ఆ మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో పంజాబ్‌ ఓడిపోయింది. అదే సీజన్‌లో మరోసారి దక్కన్‌ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టులో కీలక ఆటగాళ్లైన గిబ్స్, అండ్రూ సైమండ్స్‌, వేణుగోపాల్‌రావ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచులో పంజాబ్‌ కేవలం ఒక్క పరుగుతో విజయం సాధించింది.
హిట్‌మ్యాన్‌కో హాట్రిక్‌
ప్రస్తుత ముంబయి ఇండియన్స్‌ సారథి రోహిత్‌శర్మ 2009లో దక్కన్‌ ఛార్జర్స్‌ తరఫున ముంబయి జట్టుపై హ్యాట్రిక్‌ సాధించాడు. వరుసగా ముంబయి బ్యాట్స్‌మెన్‌ అభిషేక్‌ నాయర్‌, హర్భజన్‌ సింగ్‌, జేపీ డుమినీ వికెట్లు తీశాడు. రెండు ఓవర్లు వేసిన రోహిత్‌ శర్మ కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నాడు. దీంతో పాటు 38 పరుగులు చేసి హైదరాబాద్‌ విజయంలో కీలక పాత్రం పోషించాడు. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.
IPL బాలాజీతో ఆరంభం చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీనియర్‌ బౌలర్‌ లక్ష్మీపతి బాలాజీ డెత్‌ ఓవర్లలో ఎంత తెలివిగా బౌలింగ్‌ వేస్తాడో మనందరికీ తెలిసిందే. 2008లో ఐపీఎల్‌ చరిత్రలో తొలి హ్యాట్రిక్‌ నమోదు చేశాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాలాజీ వరుసగా ఇర్ఫాన్‌ పఠాన్‌, పియూష్‌ చావ్లా, వీఆర్‌వీ సింగ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. ఆఖరి ఓవర్‌లో 27 పరుగులు అవసరం కాగా బాలాజీ బౌలింగ్‌తో ఆ మ్యాచ్‌లో చెన్నై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్వింగ్‌ ఈజ్‌ కింగ్‌.. 2010లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్థాన్‌ రాయల్స్‌తో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో ప్రవీణ్‌ కుమార్‌ రాజస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌కు స్వింగ్‌తో చెమటలు పట్టించాడు. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన మార్టిన్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు.
ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సుమిత్‌ నర్వాల్‌ను సున్నాకే వెనక్కి పంపించాడు. డోగ్రాను క్లీన్‌ బౌల్డ్‌ చేసి హ్యాట్రిక్‌ పూర్తి చేశాడు. ప్రవీణ్‌కుమార్‌ ధాటికి రాజస్థాన్‌ కేవలం 92 పరుగులకే చాపచుట్టేసింది. బెంగళూరు పది వికెట్ల భారీ తేడాతో విజయం సాధించింది.
IPL తాంబే తిప్పేశాడు..
2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌ ఆ సీజన్‌లోనే ప్రత్యేకమైంది. 121 పరుగుల ఓపెనింగ్‌ బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. 121 నుంచి 123 పరుగుల మధ్య ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది. ప్రవీణ్‌ తాంబే బౌలింగ్‌ దెబ్బకు కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. మనీశ్ పాండే, యూసుఫ్‌ పఠాన్‌, టెన్‌ డెస్కాటేను ఔట్‌ చేసి కోల్‌కతాను 160 పరుగులకే పరిమితం చేశాడు.

IPL
FOLLOW US FB 74K FOLLOWED
వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet