Gobest.in: India vs Pakistan: IND vs PAK Match:Ind 336/5(50), Pak : 25/1 for 6 overs - world cup 2019 india vs pakistan match, ROHIT SHARMA CENTURY

 IND vs PAK Match:Ind 336/5(50), Pak : 25/1 for 6 overs


cricket-worldcup-2019-points-table

2019 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను గత ఏడాది ప్రకటించినపుడు.. క్రికెట్‌ అభిమానులు కళ్లు ఆగింది ‘జూన్‌ 16’ దగ్గర. నిరీక్షణ ఫలించింది. ఆ రోజు రానే వచ్చింది. క్రికెట్‌ అభిమానుల కలల మ్యాచ్‌ నేడే. ఇంకొన్ని గంటల్లోనే క్రికెట్‌ ప్రపంచమంతా కళ్లప్పగించి చూసే మహా సమరం! చిరకాల ప్రత్యర్థుల పోరుకు సర్వం సిద్ధం!
కానీ అందరితో పాటు వరుణుడు కూడా ఈ మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తుండటమే ఆందోళనకరం! ప్రపంచకప్‌ను వెంటాడుతున్న వర్షం ఈ మ్యాచ్‌నూ విడిచిపెట్టేలా లేదు. వరుణుడు కరుణిస్తే మాత్రం ఈ రసవత్తర పోరుతో ప్రపంచకప్‌ వేడెక్కడం ఖాయం!

india vs pakistan world cup match in engcland 2019, Manchester

వరుణుడా.. ఈ ఒక్కటి వదిలేయ్‌

భారత్‌, పాకిస్థాన్‌ యుద్ధానికి సర్వం సిద్ధం! కానీ ఇక్కడ తుపాకులుండవు, యుద్ధ విమానాలుండవు! బ్యాటు, బంతి.. ఇవే ఆయుధాలు! ఈ పోరు సాగేది ఇరు దేశాల సరిహద్దుల్లో కాదు.. ఇంగ్లిష్‌ గడ్డపై! భారతీయులు, పాకిస్థానీలు మాత్రమే కాదు.. క్రికెట్‌ ప్రపంచమంతా ఆసక్తిగా చూసే సమరం ఇది! అసలే ప్రపంచకప్‌.. ఆపై భారత్‌-పాక్‌ పోరంటే ఏ క్రికెట్‌ అభిమాని అయినా ఎలా విడిచిపెడతాడు? ఆ మాటకొస్తే క్రికెట్‌ అంటే ఆసక్తి లేని వాళ్లు సైతం ఓ కన్నేసే మ్యాచ్‌ ఇది. ఆశించిన స్థాయిలో ఉత్కంఠభరిత పోరాటాలు లేక.. వర్షం వల్ల ఏకంగా నాలుగు మ్యాచ్‌లు రద్దయి.. అసలు ప్రపంచకప్‌ జరుగుతున్న భావనే లేని తరుణంలో.. టోర్నీకి ఊపు తెచ్చే పోరు ఇదే ఇదే అవుతుందని అందరి ఆశ! గత కొన్ని నెలల్లో ఇరు దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో గెలుపు ఇరు దేశాల అభిమానులకూ ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రపంచకప్‌లో పాక్‌తో తలపడ్డ ఆరు మ్యాచ్‌ల్లోనూ జయకేతనం ఎగురవేసిన టీమ్‌ఇండియా.. చరిత్రను పునరావృతం చేస్తూ మరోసారి చిరకాల ప్రత్యర్థిని మట్టికరిపించాలని భారత అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

cricket-worldcup-2019-points-table Horoscope-1

గెలవాలి కానీ.. అలా కాదు భారత్‌, పాకిస్థాన్‌ మ్యాచ్‌లు ఒకప్పుడు ఎంత హోరాహోరీగా సాగేవో తెలిసిందే. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో భీకరంగా ఉన్న పాక్‌ను ఓడిస్తే ఆ మజానే వేరుగా ఉండేది. కానీ గత దశాబ్దంలో కథ మారింది. పాక్‌ అన్ని రకాలుగా బలహీనపడింది. అదే సమయంలో భారత్‌ బలం పెరిగింది. దీంతో ఆ జట్టుతో మ్యాచ్‌లు చాలా వరకు ఏకపక్షం అయ్యాయి. పాక్‌ జట్టులో భారత్‌కు ప్రధాన ముప్పు కాగలరని భావిస్తున్న ఆటగాళ్లు నలుగురు.
మ్యాచ్‌కి ముందే కవ్వింపులు మొదలెట్టిన అభిమానులు CRICKET-WORLDCUP-2019

భారత్‌-పాక్‌ మ్యాచ్‌ వేదికలో పిచ్‌పై ప్రస్తుతం పచ్చికే లేదట. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలమంటున్నారు. అయితే మాంచెస్టర్‌లో ప్రస్తుతం వర్షం పడుతుండటంతో పిచ్‌ ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలంగా ఉండొచ్చు.

106 మొత్తం మ్యాచ్‌లు
‘‘ఈ మ్యాచ్‌లో మేం బాగా ఆడినా, ఆడకపోయినా.. ఇక్కడితో ఏదీ ఆగిపోదు. టోర్నీ కొనసాగుతుంది. కాబట్టి విశాల దృక్పథంతో చూడాలి. ఎవరి మీదా అదనపు ఒత్తిడి ఉండదు’’
కోహ్లీ
‘‘కోట్లాది అభిమానులు కన్నార్పకుండా చూసే సమరమిది. మ్యాచ్‌లో ఏదో ఒక జట్టు గెలుస్తుంది.. ఓడుతుంది. దీన్ని మ్యాచ్‌గానే చూడాలి... యుద్ధంగా కాదు’’- అక్రమ్
ప్రపంచకప్‌లో పాక్‌పై వరుసగా ఆరుసార్లు గెలుపొందిన భారత్

ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ ఆరు సార్లు భారత్, పాకిస్థాన్ జట్లు తలపడగా.. అన్ని మ్యాచ్‌ల్లో‌నూ టీమిండియానే విజయం సాధించింది. దీంతో.. ఈ 27 ఏళ్ల జైత్రయాత్రకి బ్రేక్ వేయాలని పాక్ ఆశిస్తుండగా.. దాయాదిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత్ జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఈ మ్యాచ్‌కి వర్షం సూచనలు కూడా కనిపిస్తుండటంతో.. అభిమానులు తమ బుర్రకి మరింత పదును పెడుతున్నారు.

FOLLOW US FB 74K FOLLOWED


వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet