ARAMCO - SAUDI ప్రపంచంలోనే అత్యధిక లాభాలను సాధించిన కంపెనీ..1.71 ట్రిలియన్‌ డాలర్లుగా అరాంకో విలువ..

 ARAMCO - SAUDI ప్రపంచంలోనే అత్యధిక లాభాలను సాధించిన కంపెనీ..1.71 ట్రిలియన్‌ డాలర్లుగా అరాంకో విలువ.. ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీగా అవతరించిన సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ అరంకో 1.71 ట్రిలియన్‌ డాలర్లుగాసౌదీఅరేబియా ప్రభుత్వరంగానికి చెందిన అరాంకో విలువను 1.71ట్రిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టే అవకాశం ఉంది. 2016 సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నిర్దేశించిన 2ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం కంటే తక్కువ కావడం గమనార్హం. ఐపీవోలో మూడోవంతు షేర్లను సౌదీలోని


ARAMCO-SAUDI

సౌదీఅరేబియా ప్రభుత్వరంగానికి చెందిన అరాంకో విలువను 1.71ట్రిలియన్‌ డాలర్లుగా లెక్కగట్టే అవకాశం ఉంది. 2016 సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ నిర్దేశించిన 2ట్రిలియన్‌ డాలర్ల లక్ష్యం కంటే తక్కువ కావడం గమనార్హం. ఐపీవోలో మూడోవంతు షేర్లను సౌదీలోని 1.71 ట్రిలియన్‌ డాలర్లుగా అరాంకో విలువ - Worlds biggest public offering: Saudi Aramco seeks 1.71 trn in valuation by gobest.in
సౌదీఅరేబియా ప్రభుత్వరంగానికి చెందిన అరాంకో విలువను 1.71ట్రిలియన్ డాలర్లుగా లెక్కగట్టే అవకాశం ఉంది. 2016 సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నిర్దేశించిన 2 డాలర్ల లక్ష్యం కంటే తక్కువ కావడం గమనార్హం. ఐపీవోలో మూడోవంతు షేర్లను సౌదీలోని పెట్టుబడిదారులకే కేటాయించనుండటం విశేషం. ఈ ఐపీవోలో కంపెనీలో దాదాపు 1.5శాతం వాటాలను విక్రయించి కనీసం 24 బిలియన్ డాలర్లు సేకరించాలని భావిస్తోంది. గతంలో అలీబాబా గ్రూప్ హోల్డింగ్స్ ఐపీవో 25 బిలియన్ డాలర్లను సేకరించి రికార్డు సృష్టించింది. అరాంకో ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.
డిసెంబర్ ఐదోతేదీన కంపెనీ పూర్తివిలువను వెల్లడించనున్నారు. మరోపక్క బ్లూమ్ బెర్గ్ సంస్థ 24 మనీమేనేజ్ మెంట్ సంస్థల నుంచి సేకరించిన అభిప్రాయం ప్రకారం 1.2 ట్రిలియన్ డాలర్ల నుంచి 1.5 ట్రిలియన్ డాలర్ల మధ్యలో దీనివిలువను నిర్దారించవచ్చని తెలుస్తోంది.
మరోపక్క ఆదివారం ఇన్వెస్టర్ రోడ్ షోను కంపెనీ సీఈవో అమిన్ నాసిర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదో చారిత్రకమైన రోజు అని అన్నారు. మరోపక్క ఈ ఐపీవోలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సౌదీకి చెందిన సంపన్నులు ఒలాయన్ కుటుంబీకులు, అల్ వాలీద్ యోచిస్తున్నట్టు సమాచారం. అల్ వాలీద్ ను 2017లో రిట్జ్ కార్లటన్ హోటల్ లో బంధించారు. చైనా కూడా ఈ ఐపీవోలో దాదాపు 10 బిలియన్ లర్లను సావరీన్ వెల్త్ ఫండ్ లో పెట్టుబడి పెట్టేఅవకాశాలు మొండుగా ఉన్నాయి. ఏ విషయమైన గోప్యంగా ఉంచే సౌదీ అరేబియాలో ఒక కంపెనీ చేసిన ప్రకటన ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. సౌదీ అరేబియాకు చెందిన చమురు రంగ దిగ్గజం అరామ్‌కో తొలిసారి తన వార్షిక లాభాలను బాహ్యప్రపంచానికి వెల్లడించింది. ఆ వివరాలు విని యాపిల్‌తో సహా దిగ్గజ కంపెనీలు కూడా నోళ్లు వెళ్లబెట్టాయి. గత ఏడాది 111.1 బిలియన్‌ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు పేర్కొంది. అంటే అక్షరాలా రూ.7.69లక్షల కోట్లు. గత ఏడాది ప్రపంచంలోనే అత్యధిక లాభాలను సాధించిన కంపెనీగా ఇది రికార్డు సృష్టించింది. 2018లో ఇప్పటి వరకు యాపిల్‌ 59 బిలియన్‌ డాలర్లు, రాయల్‌ డచ్‌ షెల్ 23.9 బిలియన్‌ డాలర్లు, ఎక్సాన్‌ మొబైల్‌ 20.8 బిలియన్‌ డాలర్ల లాభాన్ని సంపాదించాయి. ఇప్పుడు ఈ మూడు కంపెనీల లాభాన్ని కలిపినా అరామ్‌కో లాభంతో సమానం కాలేదు. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది.

FOLLOW US FB 74K FOLLOWED


ARAMCO-SAUDI

కళ్లు తెరిపించిన 2014..

సౌదీకి చెందిన అరామ్‌కో ఇప్పటి వరకు తన లాభాలను వెల్లడించలేదు. 1938 నుంచి చమురు ఆదాయంతో సౌదీ సంపద వెల్లివిరిసింది. ప్రజలకు భారీ సబ్సిడీలను ఇస్తున్నారు. కొన్నాళ్ల కిందటి వరకు పన్ను వసూళ్లు కూడా లేవు. కానీ 2014లో చమురు ధరలు పతనం కావడంతో ఆర్థిక వ్యవస్థ ఒక కుదుపునకు లోనైంది. దీంతో లోటు బడ్జెట్‌ ప్రభావం తెలిసి వచ్చింది. ఇప్పుడే ఇలా ఉంటే కొన్నేళ్ల తర్వాత చమురు నిల్వలు అంతమైపోతే పరిస్థితి ఏమిటనేది సౌదీకి అంతుబట్టలేదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కేవలం చమురుపై ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని పాలకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో అరామ్‌కోను మార్కెట్లో లిస్టు చేయాలని సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ సంకల్పించారు. ఇది ఐపీవోకు వస్తే ప్రపంచంలో అదే అతి పెద్దది కానుంది. ఐపీవోకు వచ్చే కంపెనీలు తప్పనిసరిగా తమ లెక్కల పుస్తకాలను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లాభాలను ప్రకటించింది. ప్రస్తుతం అరామ్‌కో విలువ 1 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 1.5 ట్రిలియన్‌ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ లిస్టింగ్‌తో ఈ కంపెనీ విలువ 2 ట్రిలియన్‌ డాలర్లను దాటే అవకాశం ఉంది. ఈ లిస్టింగ్‌ ద్వారా వచ్చే నిధులతో టెక్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని సౌదీ భావిస్తోంది. ఇప్పటికే సౌదీ సావరీన్‌ ఫండ్స్‌ ద్వారా టెస్లా, ఉబెర్‌ వంటి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది

దుబాయ్‌ ఆదర్శం...

గల్ఫ్‌ దేశాల్లో దుబాయ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ చమురుపై ఆధారపడే పరిస్థితి నుంచి పూర్తిగా బయటపడి దూసుకెళుతోంది. 20ఏళ్ల కిందటే దీనికి సంబంధించిన ప్రణాళిక అమలును ప్రారంభించింది. పెట్టుబడులకు అనువైన వసతులను కల్పించింది. దీంతోపాటు స్వేచ్ఛా ఆర్థిక విధానాలను అమలు చేసింది. దీంతో ప్రపంచం నలు మూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించింది. ప్రపంచంలోని ప్రతి అతిపెద్ద కంపెనీ దుబాయ్‌లో ఒక శాఖను ఏర్పాటు చేశాయంటే అతిశయోక్తి కాదు. పలు దేశాల్లోని అత్యున్నత విశ్వవిద్యాలయాలు ఇక్కడి అకాడమిక్‌ సిటీలో తమ శాఖలను ఏర్పాటు చేశాయి. మధ్యప్రాశ్చ్యంలో పర్యటకులు అత్యధికంగా సందర్శించే నగరం కూడా దుబాయే. ఫలితంగా దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నేడు ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన ఎయిర్‌పోర్టు. దేశ జీడీపీలో కీలక వాటాను సొంతం చేసుకొంది. ఈ ప్రాంతంలో అత్యంత రద్దీ అయిన నౌకాశ్రయంగా దుబాయ్‌లోని ది జబెల్‌ అలీ పోర్టు పేరు తెచ్చుకొంది. ఫలితంగా ప్రస్తుతం దుబాయ్‌ జీడీపీలో చమురు వాటా కేవలం 5శాతానికి చేరింది. ప్రపంచంలో మరే ఆర్థిక వ్యవస్థ ఇంత వేగంగా మారలేదు. దుబాయ్‌ రాజు జయేద్‌ అల్‌ నహ్యన్‌ సౌదీ యువరాజుకు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌కు అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో సౌదీ యువరాజు కూడా దుబాయ్‌ బాటలోనే నడిచేందుకు యత్నాలు మొదలు పెట్టారు.

Bill Gates tops Jeff Bezos as richest person in the world - GOBEST
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, శుక్రవారం, గేట్స్ అమెజాన్ (AMZN) సిఇఒ జెఫ్ బెజోస్‌ను అధిగమించి, ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి గుర్తింపును 110 బిలియన్ డాలర్లతో పొందారు.
మైక్రోసాఫ్ట్ (ఎంఎస్‌ఎఫ్‌టి) సహ వ్యవస్థాపకుడు రెండేళ్లలో అగ్రస్థానాన్ని పొందడం ఇదే మొదటిసారి. సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల లాభం ఏడాది క్రితం కంటే దాదాపు 28% పడిపోయిందని అమెజాన్ నివేదించిన తరువాత అతను గత నెలలో బెజోస్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. కానీ పైభాగంలో గేట్స్ సమయం స్వల్పకాలికం.
Nidhhi Agerwal Latest Photoshoot

నిధి అగర్వాల్ Latest Photoshoot

old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

yashasvi jaiswal cricket mumbai

CRICKET : ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన ముంబై టీన్ యశస్వి జైస్వాల్

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet