Gobest.in: తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని ఉంటాయి, amaranth leaves

 తోటకూరతో చాలా లాభాలున్నాయి


thotakura-gobest1

మార్కెట్లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి.
అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్ టెన్షన్ తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది. తోటకూరలోని విటమిన్; రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్ నుంచి మరో సీజను వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది.తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్ గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది.
కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్ , జింక్;, కాపర్;, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి. విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్; ఎ, సి, డి, ఇ, కె, విటమిన్; బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి. వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి.తోటకూర కమ్మకమ్మగా..!
తోటకూర పెరుగు

thotakura-1

తోటకూర అనగానే వేయించడమో లేదా పప్పులో వేయడమో చేస్తుంటాం. కానీ దాన్ని రకరకాలుగా అదీ పోషకాలు పోకుండా కూడా వండుకోవచ్చు అంటున్నారు ఈతరం షెఫ్‌లు
కావలసినవి తోటకూర: 4 కట్టలు(సన్నవి),
పెరుగు: 3 కప్పులు,
కొబ్బరి తురుము: కప్పు,
పచ్చిమిర్చి: ఆరు,
నువ్వులు: టీస్పూను,
ఆవాలు: అరటీస్పూను,
జీలకర్ర: టీస్పూను,
ఎండుమిర్చి: ఒకటి, కరివేపాకు: రెండు రెబ్బలు, నూనె: 2 టీస్పూన్లు
తయారుచేసే విధానం
* తోటకూర కడిగి సన్నగా తరిగి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ఆకులు మరీ మెత్తగా కాకుండా చూడాలి.
* బాణలిలో టీస్పూను నూనె వేసి నువ్వులు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరవాత రెండింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేయాలి. ఇప్పుడు ఓ గిన్నెలో పెరుగు వేసి బాగా కలిపి అందులో ఉడికించిన తోటకూర, రుబ్బిన పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు విడిగా చిన్న బాణలిలో మిగిలిన నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకులతో తాలింపు చేసి పెరుగులో కలిపితే సరి.

తోటకూర- కొబ్బరి

thotakura-1

కావలసినవి తోటకూర: 4 కట్టలు,
కొబ్బరితురుము: ముప్పావు కప్పు,
ఉల్లిపాయ: ఒకటి,
వెల్లుల్లి రెబ్బలు: ఏడు,
జీలకర్ర: పావుటీస్పూను,
పసుపు: టీస్పూను,
కారం: ఒకటింపావు టీస్పూను, పచ్చిమిర్చి: రెండు,
ఆవాలు: అరటీస్పూను,
కరివేపాకు: 2 రెబ్బలు, నూనె:టేబుల్‌స్పూను
తయారుచేసే విధానం
* తోటకూరను సన్నగా తరగాలి.
* మిక్సీలో కొబ్బరి తురుము, వెల్లుల్లిరెబ్బలు, జీలకర్ర, పసుపు, కారం వేసి వేయించాలి.
* పాన్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు వేయాలి. తరవాత కరివేపాకు, చీల్చిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు తోటకూర కూడా వేసి రెండు నిమిషాలు వేగాక ఉప్పు వేసి కలపాలి. తరవాత కొబ్బరి మిశ్రమం కూడా వేసి బాగా వేయించి తీయాలి.

Horoscope-1


తోటకూర మసాలా పప్పు

thotakura-1

కావలసినవి తోటకూర: 4 కట్టలు (సన్నవి),
పెసర పప్పు: కప్పు,
వెల్లుల్లి: ఎనిమిది,
ఉల్లిపాయలు: రెండు,
టొమాటోలు: నాలుగు,
పచ్చిమిర్చి: నాలుగు,
అల్లంతురుము: 2
టీస్పూన్లు, జ
ీలకర్ర: టీస్పూను,
పసుపు: అరటీస్పూను,
కారం: టీస్పూను,
దనియాలపొడి: టీస్పూను,
ఉప్పు: రుచికి సరిపడా,
కారం: టీస్పూను,
నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు,
కొత్తిమీర తురుము: కొద్దిగా
తయారుచేసే విధానం
పెసరపప్పుని కడిగి విడిగా ఉడికించి ఉంచాలి.
మందపాటి గిన్నెలో నెయ్యి వేసి అల్లం తురుము, ఉల్లిముక్కలు వేసి వేయించాలి. తరవాత టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి. ఇప్పుడు పసుపు, కారం, దనియాలపొడి, చిదిమిన వెల్లుల్లి వేసి కలపాలి. తరవాత సన్నగా తరిగిన తోటకూర వేసి, తగినన్ని నీళ్లు పోసి ఆకు మెత్తగా అయ్యేవరకూ ఉడికించాలి. ఇప్పుడు ఉడికించిన పెసరపప్పు కూడా వేసి రెండు నిమిషాలు ఉడికిన తరవాత కొత్తిమీర తురుము చల్లి దించితే సరి.

FOLLOW US FB 74K FOLLOWED


వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet