Gobest.in: ఎండాకాలం.. ఏం తినాలి? ఏం తాగాలి?

 ఎండాకాలం.. ఏం తినాలి? ఏం తాగాలి? వేసవిలో చర్మాన్ని కాపాడేదెలా? శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చిట్కాలు


కూల్ ..కూల్ గా హెల్తీ సమ్మర్ డ్రింక్స్ ..by SURESH KURUPATI

summer-special-gobest


summer-special-gobest


summer-special-gobest


summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

summer-special-gobest

వేసవిలో చర్మాన్ని కాపాడేదెలా? శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి చిట్కాలు summer-special-gobest
వేసవి కాలంలో ఇంట్లో ఉన్నా సరిగా నీళ్ళు తాగకపోతే డీహైడ్రేషన్ సమస్య భారిన పడే ప్రమాదం ఉంది. దాని వల్ల నిద్ర, అజీర్తి వంటి సమస్యలు వేధిస్తాయి. పుచ్చకామలు, కీరదోస, నిమ్మరసం, పండ్ల రసాలకు ప్రాధాన్యమిస్తే మంచిది. వీటితో పాటు టీ, కాఫీలను తీసుకోవడం తగ్గించాలి. ఒక వేళ తీసుకున్నా వాటిలో పంచదార శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. నిల్వ ఉన్న ఆహారం కాకుండా తాజాగా ఉండేదానికి ప్రాధాన్యమివ్వాలి.

summer-safety

బాగా ఎండగా ఉన్నప్పుడు.. చల్లని పండ్లరసాలు గొంతులోకి దిగుతోంటే కలిగే హాయి అంతాఇంతా కాదు! అలాగని బయట దొరికేవి ఏవి పడితే అవి తీసుకుంటే.. అనారోగ్యాలు తప్పవు. అందుకే ఏవయినా..చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. వాటి నుంచి పోషకాలూ అందేలా చూసుకోవాలి. మన ఇంట్లో ఉండే హెల్తీ కూల్ డ్రింక్స్ ఏంటో ఒకసారి చూద్దాం...

మజ్జిగ:
ఇందులో ఆరోగ్యకరమైన బాక్టీరియా పుష్కలంగా ఉంటుంది. పోషక విలువలు, విటమిన్ల తయారీలో ఇది ఉపయోగపడుతుంది. మజ్జిగ జీర్ణశక్తిని ఇస్తుంది. జావ, కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, జీలకర్ర నీళ్ళు వంటివి కూడా శరీరంలోని వేడిని తగ్గించే దివ్వమైనటువంటి పానియం

కొబ్బరి బొండాం:
ప్రకృతి ప్రసాధించిన శీతల పానీయం. ఎండ వల్ల నల్లగా మారి కమిలిన చర్మానికి కొబ్బరి, కొబ్బరి నీళ్లు కూడా ఎంతో మేలు చేస్తాయి. కుదుళ్లను బలంగా మార్చడంలో కొబ్బరి పాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దప్పిక తీరిపోతుంది. అలసట గాలికెగిరిపోతుంది. జీర్ణశక్తిని పెంచడం మొదలుకొని మూత్రపిండాల్ని శుభ్రం చేయడం దాకా..బోలెడన్ని ఆరోగ్య సేవలు అందిస్తుంది. కొబ్బరి నీళ్లలో చిటికెడు ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే డీహైడ్రేషన్ సమస్య ఉండదు. బయటినుంచి వచ్చాక ఐదు నిమిషాలు విశ్రాంతి తీసుకుని కొబ్బరినీటితో ముఖం కడుక్కుంటే.. ఎండ వల్ల నల్లగా మారిన చర్మం తాజాదనాన్ని పొందుతుంది. కొబ్బరి నీటిలో దూదిని ముంచి రాసుకున్నా తేడా కనిపిస్తుంది.

ఆరెంజ్ జ్యూస్:
ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. తొక్కను తీసి జ్యూసర్ లో వేసి జ్యూస్ తీసి అందులో కొద్దిగా పంచదార మరియు తేనె మిక్స్ చేసి తీసుకుంటే ఇది పొట్టను చల్లగా ఉంచుతుంది మరియు వేడి వాతావరణంలో కొద్దిగా ఉపశమనం కలిగిస్తుంది.

బెర్రీ జ్యూస్:
బెర్రీ జ్యూస్: గుప్పెడు బెర్రీలను జ్యూసర్ లో వేసి జ్యూస్ చేసి, అందులో కొద్దిగా పాలు మరియు తేనె మిక్స్ చేసి తీసుకోవడం వల్ల సమ్మర్ హీట్ ను ఎదుర్కోవడమే కాకుండా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

కుకుంబర్ జ్యూస్:
మీకు నచ్చిన వారికోసం ఆరోగ్యకరమైన డ్రింక్ ను అందివ్వడంలో ఇది ఒక హెల్తీ డ్రింక్. దీనికి కొద్దిగా ఒక చెంచా తేనె మిక్స్ చేసి, అలాగే చిటికెడు ఉప్పు మిక్స్ చేసి అందివ్వాలి.

పుదీనా జ్యూస్:
పుదీనా జ్యూస్: పుదీనా శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. కాబట్టి, వేసవికాలంలో ఖచ్చితంగా తీసుకోవాలి. రెండు చెంచాల నిమ్మరసంలో గుప్పెడు పుదీనా ఆకులు ఒక చెంచా తేనె మిక్స్ చేసి మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ చేసి కూల్ స్మూతీలా అందివ్వాలి.

వాటర్ మెలోన్ జ్యూస్ :
వాటర్ మెలోన్ జ్యూస్ : ఈ వాటర్ మెలోన్ జ్యూస్ ను వేసవిలో పిల్లలు మరియు పెద్దలతో పాటు అందరూ తీసుకోవచ్చు. నాలుగు పీసుల వాటర్ మెలోన్ ముక్కలుగా చేసి జ్యూస్ చేసి విత్తనాలు తొలగించి తీసుకోవాలి.

క్యారెట్ జ్యూస్:
క్యారెట్ జ్యూస్: క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది మరియు జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది . ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ కు ఒక చెంచా పంచదార కూడా జోడించి తీసుకోవాలి . కొద్దిగా పుదీనా వేస్తే కూల్ టేస్ట్ ను అందిస్తుంది

జామ జ్యూస్:
గోవ జ్యూస్ : జామకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది అందువల్ల దీన్ని వేసవికాలంలో తీసుకోవడం మంచిది. తయారుచేసేప్పుడు అందులోని విత్తనాలన్నీ తొలగించాలి.

టమోటో జ్యూస్:
టమోటో జ్యూస్: టమోటో జ్యూస్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉన్నది . ఇది తక్షణం ఎనర్జీని అందిస్తుంది. స్కిన్ కాంప్లెక్స్ ను పెంచుతుంది. బాగా పండిన టమోటోలను జ్యూస్ గా చేసి అందులో కొద్దిగా తేనె మిక్స్ చేసి, అందులో కొద్దిగా సాల్ట్ మిక్స్ చేసి తీసుకోవాలి.

నీళ్ళు:
నీళ్ళు: వేసవికి మందు మంచినీళ్లే. రోజూ కనీసం మూడు లీటర్ల నీళ్లు తీసుకోవాలి. జీవనశైలిని బట్టి ఆ మోతాదును పెంచుకోవచ్చు. నీరు, చర్మం లోని తేమను కాపాడుతుంది. కాలుష్యాన్ని బయటికి పంపుతుంది. రక్తాన్ని శుద్దిచేస్తుంది. బయటికివెళ్ళేటప్పుడు తప్పనిసరిగా నీళ్లుతీసుకెళ్లడం మంచిది. వేసవిలో దాహంగా అనిపించేదాకా ఆగక్కర్లేదు. తీరికి దొరికినప్పుడుల్లా గొంతు తడుపుకోవడమే మంచిది.

FOLLOW US FB 74K FOLLOWED
వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet