Gobest.in: Ind vs nz semi final: కివీస్ అతిపెద్ద బలహీనత ఇదే.. ఇక్కడ దెబ్బ కొడితే భారత్ ఫైనల్ చేరొచ్చు! - india vs new zealand: this strategy may help team india to beat new zealand in world cup 2019 semi final

 ఇక్కడ దెబ్బ కొడితే భారత్ ఫైనల్‌ చేరొచ్చు! హైలైట్స్


cricket-worldcup-2019-points-table

రల్డ్ కప్‌లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. కివీస్ ప్రధానంగా విలియమ్సన్, రాస్ టేలర్‌పై ఆధారపడుతుంది. బౌలింగ్‌లో బౌల్ట్‌ను ఎదుర్కొవడం ముఖ్యం.
వరల్డ్ కప్‌లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ మంగళవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది.
ఆఖరి ఓవర్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన మహ్మద్ షమీ
కివీస్ ప్రధానంగా విలియమ్సన్, రాస్ టేలర్‌పై ఆధారపడుతుంది.
బౌలింగ్‌లో బౌల్ట్‌ను ఎదుర్కొవడం ముఖ్యం.మాంచెస్టర్ వేదికగా.. cricket-india-andhra-telugu

మాంచెస్టర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్ మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు వరణుడి ముప్పు పొంచి ఉంది. మంగళవారం మ్యాచ్ రద్దయినా.. రిజర్వ్ డే ఉండటంతో.. బుధవారం మ్యాచ్‌ను నిర్వహించే వీలుంది. ఆ రోజు కూడా ఆట సాగకపోతే.. లీగ్ దశలో ఎక్కువ పాయింట్లు సాధించిన భారత్ ఫైనల్ చేరుతుంది. ఇక వాతావరణం సహకరించి మ్యాచ్ సాగితే.. ఇరు జట్ల బలాబలాలు ఏంటనేది ప్రధానాంశం కానుంది. ఈ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ బలహీనతలపై దెబ్బకొడితే టీమిండియా ఫైనల్ చేరొచ్చు.

Horoscope-1

లీగ్ దశలో ఆరు మ్యాచ్‌లు ముగిసే వరకు న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగింది. భారత్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. శ్రీలంక, బంగ్లాదేశ్, అప్ఘానిస్థాన్, సౌతాఫ్రికా, విండీస్‌లపై కివీస్ గెలుపొందింది. చావోరేవో లాంటి మ్యాచ్‌లో గెలిచిన పాకిస్థాన్‌ న్యూజిలాండ్‌కు తొలి ఓటమి రుచి చూపింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లతో జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిన కివీస్.. నెట్ రన్‌రేట్‌తో సెమీస్ చేరింది
ఈ వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ప్రధాన బలం బౌలింగ్, టాప్ ఆర్డర్. నిలకడగా ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఏడు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ బాదిన విలియమ్సన్ 481 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాపై 106*, వెస్టిండిస్‌పై 148 పరుగులు చేసి కివీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఓడిన మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్‌పై 40 పరుగులు, ఆసీస్‌పై 48 పరుగులు చేశాడు CRICKET-WORLDCUP-2019

Ind Vs NZ first semi final

ప్రస్తుత వరల్డ్ కప్‌లో అత్యధిక సగటుతో (96.20) పరుగులు రాబట్టిన ఆటగాడు విలియమ్సన్. రోహిత్ (92.42) కూడా అతడి తర్వాతి స్థానంలోనే ఉన్నాడు. కేన్ నిలకడగా ఆడుతున్నప్పటికీ.. మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి అతడికి పెద్దగా సహకారం లభించడం లేదు. ఈ వరల్డ్ కప్‌లో కివీస్ చేసిన పరుగుల్లో 44 శాతం టేలర్, విలియమ్సన్‌‌లవే. వీరిద్దర్నీ త్వరగా అవుట్ చేస్తే భారత్ సగం మ్యాచ్ గెలిచినట్టే.

cricket-worldcup-2019-points-table

ఒక వేళ ముందుగా బ్యాటింగ్ చేస్తే 250కిపైగా పరుగులు చేస్తే చాలు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ ఇప్పటి వరకూ 250కిపైగా పరుగుల లక్ష్యాన్ని చేధించలేదు. కానీ బౌల్ట్, ఫెర్గ్యుసన్ రూపంలో భారత బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష ఎదురయ్యే అవకాశం ఉంది. వార్మప్ మ్యాచ్‌లో బౌల్ట్ 4 వికెట్లు తీయగా.. నీషామ్ 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ 179 పరుగులకే ఆలౌటయ్యింది. ఈ మ్యాచ్‌లో బౌల్ట్ బౌలింగ్‌లో అవుటైన రోహిత్.. వన్డేల్లో అతడి బౌలింగ్‌లో మొత్తం 126 బంతులు ఎదుర్కొని 88 పరుగులు మాత్రమే చేసి నాలుగుసార్లు ఔటయ్యాడు. కాబట్టి బౌల్ట్‌ను రోహిత్ ఎలా ఎదుర్కొంటాడనేది సెమీస్‌లో కీలకం కానుంది
మరో విషయం ఏంటంటే.. ప్రస్తుత వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌పై 300కిపైగా పరుగులు చేసిన ఏకైక జట్టు ఇంగ్లాండ్. చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లిష్ జట్టు 305 రన్స్ చేసింది. పేస్, మీడియం ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో కివీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు. రోహిత్ మరోసారి మెరిసి టీమిండియా 250కిపైగా పరుగులు చేయడంతోపాటు.. విలియమ్సన్‌ను త్వరగా పెవిలియన్ చేరిస్తే.. భారత్ మ్యాచ్ గెలిచే అవకాశాలెక్కువ.

FOLLOW US FB 74K FOLLOWED


ఈ మ్యాచ్‌కు వరణుడి ముప్పు పొంచి ఉంది

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

andhra-telugu

ఆంధ్ర లో తప్పక చూడవలసిన ప్రదేశాలు

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet