‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట


హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో మరో ఇద్దరు స్టార్లు సందడి చేయనున్నారట. ఇప్పటికే బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ను ఈ సినిమాలో కథానాయికగా తీసుకున్న సంగతి తెలిసిందే. అజయ్‌ దేవగణ్‌ కూడా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. కాగా బాలీవుడ్ నటులు వరుణ్‌ ధావన్‌, సంజయ్‌ దత్‌ను ఈ చిత్రంలోని కీలక పాత్రలకు దర్శక, నిర్మాతలు సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు నటిస్తామని వారు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


FOLLOW US FB 74K FOLLOWED

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో కథానాయకుల పాత్రలు పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. ఆలియాతోపాటు డైసీ ఎడ్గార్‌ జోన్స్‌ మరో కథానాయిక. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దానయ్య నిర్మాత. వచ్చే ఏడాది జులై 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అన్నీ భారతీయ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

sanjay-dutt

‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో మరో ఇద్దరు స్టార్లు.. సంతకం చేసేశారట

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

పచ్చని పొలాల్లో పోష్ పోరి.. రాశి కన్నా

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

AMERICANS

అమెరికాలో భారతీయులకు వల.. పెళ్లిళ్లు చేసి..

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet