Gobest.in: క్రికెట్‌ను చంపేశారు క‌ద‌రా: ఐసీసీపై నెటిజ‌న్ల ఫైర్‌

 క్రికెట్‌ను చంపేశారు క‌ద‌రా: ఐసీసీపై నెటిజ‌న్ల ఫైర్‌


cricket-worldcup-2019-points-table

న్యూఢిల్లీ: లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో ఆదివారం జ‌రిగిన ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు విజ‌యం సాధించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లండ్ గెల‌వ‌డానికి ప్ర‌ధాన కార‌ణం- అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిబంధ‌న‌లే కార‌ణ‌మంటూ క్రికెట్ ప్రేమికులు నిన‌దిస్తున్నారు. ఆక్రోశిస్తున్నారు. త‌మ ఆవేద‌న‌ను ట్వీట్ల ద్వారా వెల్ల‌గ‌క్కుతున్నారు. ఐసీసీ నిబంధ‌న‌ల వ్య‌వ‌హారంపై నిప్పులు చెరుగుతున్నారు. ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచినా.. నైతికంగా ఓట‌మి పాలైంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. టైగా ముగిసిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండే ఘ‌న విజ‌యం సాధించింద‌ని, ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా తాము బ్లాక్ క్యాప్స్‌ను గుర్తిస్తామ‌ని అంటున్నారు.ఐసీసీ కంటే గ‌ల్లీ క్రికెట్టే న‌యం..

ఘ‌న‌త వ‌హించిన ఐసీసీ కంటే గ‌ల్లీ క్రికెట్ నిర్వాహ‌కులే మేలు అని అంటున్నారు ట్విట్ట‌రెటీస్‌. నిబంధ‌న‌ల‌ను ప‌క్కాగా రూపొందిస్తార‌ని, ఇలా అడ్డగోలుగా, ఇష్టానుసారంగా ఏ ఒక్క జ‌ట్టుకో మేలు క‌లిగించేలా నిబంధ‌న‌ల‌ను ఎప్పటికీ రూపొందించ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. సాధార‌ణంగా వ‌న్డే మ్యాచ్‌లు టైగా ముగియ‌డాన్ని మ‌నం చూస్తుంటాం. మ్యాచ్ టైగా ముగిస్తే..ఇంకో ఓవ‌ర్ అద‌నంగా వేయిస్తారు. ఈ సూప‌ర్ ఓవ‌ర్‌లో ఎవ‌రు ఎక్కువ‌గా ప‌రుగులు చేస్తే- వాళ్లే విజేతగా నిలుస్తారు. ఆ సూప‌ర్ ఓవ‌ర్ కూడా టైగా మారితే..? సాధార‌ణ మ్యాచుల్లో ఇలా జ‌రిగితే ఫ‌ర్లేద‌నుకోవ‌చ్చు. ప్ర‌పంచ‌క‌ప్ విజేత ఎవ‌రో తేల్చాల్సిన మ్యాచ్‌లో ఇదే ప‌రిస్థితి త‌లెత్తింది. న్యూజిలాండ్ అద్భుత పోరాట ప‌టిమ వ‌ల్ల సూప‌ర్ ఓవ‌ర్ దాకా వెళ్లిన ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌..చివ‌రికి అక్క‌డ కూడా టైగానే ముగిసింది.

Horoscope-1

కివీస్ ఓడింది..అభిమానుల హృద‌యాల‌ను గెలుచుకుంది. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా ఆవిర్భ‌వించిన‌ప్ప‌టికీ.. నిజానికి గెలిచింది మాత్రం- న్యూజిలాండ్ అని వ్యాఖ్యానిస్తున్నారు నెటిజ‌న్లు. అద్భుత‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించింద‌ని బ్లాక్ క్యాప్స్‌ను అభినంద‌న‌ల్లో ముంచెత్తుతున్నారు. సూప‌ర్ ఓవ‌ర్‌ను సైతం టైగా మల‌చ‌డం.. గెలుపు అంచుల దాకా వెళ్లిన న్యూజిలాండ్‌ను ఐసీసీ నిబంధ‌న‌లు ఓడించాయ‌ని విమ‌ర్శిస్తున్నారు. సూప‌ర్ ఓవ‌ర్ కూడా టైగా ముగిస్తే- అంత‌ర్జాతీయ క్రికెట్ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. బౌండ‌రీల‌ను లెక్కిస్తారు. ఏ జ‌ట్టు ఎక్కువ‌గా బౌండ‌రీలు బాదుతుందో.. ఆ జ‌ట్టే ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌. మ్యాచ్ మొత్తం మీద ఏ జ‌ట్టు ఎక్కువ‌గా బౌండ‌రీల‌ను కొట్టారో.. ఆ జ‌ట్టును విజేత‌గా ప్ర‌క‌టించారు. న్యూజిలాండ్ త‌న ఇన్నింగ్‌లో 17 బౌండ‌రీల‌ను సాధించింది. ఇంగ్లండ్ 26 బౌండ‌రీల‌ను బాదింది. దీని ఫ‌లితంగా- విజేత‌ను నిర్ణ‌యించాల్సి వ‌స్తుంది.
CRICKET-WORLDCUP-2019

Ind Vs NZ first semi final

cricket-worldcup-2019-points-table

FOLLOW US FB 74K FOLLOWED


MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

hyderabad

ప్రపంచవ్యాప్తంగా 231 నగరాల్లో హైదరాబాద్‌కు 143వ ర్యాంక్‌

andhra-telugu

ఆంధ్ర లో తప్పక చూడవలసిన ప్రదేశాలు

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

ఐపీఎల్ 2019: కోహ్లీకి వార్నింగ్ ఇచ్చిన ధోని

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

వామ్మో పాపనే మరచిపోయింది : విమానం అత్యవసర ల్యాండింగ్, వీడియో వైరల్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet