Bhimavaram, ఆంధ్ర ప్రముఖ పట్టణాలలో భీమవరం ఒకటి

 భీమవరం in one of the Great Sign in West Godavari

Bhimavaram andhra, భీమవరం

భీమవరం in one of the Great Sign in West Godavari

Bhimavaram andhra

భీమవరం సంస్కృతీ

Mavullamma gudi

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం
Bhimavaram పర్యాటకులకు ఆకర్షణలు

Famous Shrink business

#భీమవరం మన గోదావరి జిల్లాలలో అత్యంత ఖరీదైన పట్టణం అండి అన్నట్టు మన భీమవరంను ఆంధ్రా లాస్ వెగాస్ అని కూడా అంటారండోయ్
#భీమవరంకు ఈ పేరు రావడానికి కారణం పంచారామములలో ఒకటైన ఈ భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రం. తూర్పు చాళుక్య రాజైన భీమ క్రీ.శ. 800 - 900 సంవత్సరాల మధ్య ఇక్కడ స్వామి వారి ఆలయంకి శంకుస్థాపన చేసారని చెబుతారు. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణానికి #భీమవరం అనే పేరు వచ్చిందని అంటారు.
ఈ క్షేత్రం భీమవరం పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరాన ఉన్నటువంటి #గునుపూడి గ్రామంలో ఉంది. ఈ ఆలయం గురించి మన పేజీ లో ఈ మధ్యనే పోస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ అంతా రాయడం ఎందుకు అని ఆ పోస్ట్ యొక్క లింక్ ను ఇక్కడ షేర్ చేస్తున్నా ... ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి సోమేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు ఉంటాయి.
భీమవరం అనగానే మనకి గుర్తొచ్చేది శ్రీ మావుళమ్మ అమ్మవారి ఆలయం. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారు భక్తులు కొలిచే దైవ స్వరూపిణి శ్రీ మావుళమ్మ తల్లి ... సుమారు 90 కిలోల బంగారం ,,, 700 కేజీల వెండి ఆభరనాలు అమ్మవారికి ఉన్నాయి అందుకే అత్యంత ఖరీదైన అమ్మవారిగా కూడా చెబుతారు.అమ్మవారి అలయంకి 9 శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ తూర్పు చాళుక్యులు కాలం నుండి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. క్రీ.శ 1200 సంవత్సరంలో అమ్మవారు ఇక్కడ వెలిసినట్టు స్థల పురాణం చెబుతుంది. మామిడి తోటలో స్వయంభూ వెలిసిన కారణంగా అమ్మవారిని తోలునాళ్ళు మావిడిలమ్మ గా తర్వాత కాలక్రమేణా మావుళమ్మగా పిలుస్తున్నారు ,, ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర , ఉత్సవాలు వేరు వేరుగా జరుపుతారు ... జాతరను రజక సంఘం వారు ఒకసారి ( పూర్వం ఈ ఆలయంలో రజక పూజారి అమ్మవారికి పూజలు నిర్వహించెవారు. అందువలన ఒకసారి రజక సంఘం వారు ),,, మిగతా పూల , పండ్ల మరియు ఇతర సంఘం వారు ఒకసారి జరుపుతారు ,, మొదట్లో పూరీ గుడిసెలో అమ్మవారికి పూజలు నిర్వహించేవారు అప్పట్లో జంతుబలులు కూడా జరిగేవని చెబుతారు... అమ్మవారు ఒకసారి గ్రంధి అప్పన్న , మారేళ్ళ మాచిరాజు గారికి కలలో కనిపించి ఆలయం నిర్మించి తనని ప్రతిష్టించాలి అని కోరగా 1920 లో కాళ్ళ గ్రామానికి చెందిన తాతవోలు నాగభూషణాచార్యులు గారిచే అమ్మవారి శిలా విగ్రహాన్ని రూపొందించారు. కాని అప్పట్లో అమ్మవారు భీకర రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చేవారు. 1929 లో వచ్చిన పెను తుఫాన్ కారణంగా అమ్మవారి ఆలయం ద్వంశం అయ్యింది... అనంతరం అప్పట్లో అమ్మవారి ఆలయంలో యంత్ర ప్రతిష్ట జరిపించి ఈ ప్రాంతానికి వచ్చిన అరిష్టాన్ని నివారించారు ... 1934 లో శ్రీపాద నరసింహం యామిజాల శ్రీరామమూర్తులు వారు ఇక్కడ మహంకాళి , మహాసరస్వతి , మహాలక్ష్మి అనే అంశాలతో యంత్ర ప్రతిష్ట చేసి అమ్మవారిని శాంతి స్వరూపిణిగా విగ్రహ ప్రతిష్ట చేశారు. భీమవరం కి దగ్గరలో మరిన్ని ప్రముఖ ఆలయాలు ఉన్నాయి సాయిబాబా ఆలయం, సూర్యభగవాన్ ఆలయం, క్యాథలిక్ చర్చ్, పారుపల్లి అమ్మవారి ఆలయం, దిరుసుమర్రు ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం, వీరభద్ర స్వామి ఆలయం, బాల సుబ్రమణ్య టెంపుల్, ఆదుర్రు - చారిత్రక స్థలం, యనమదుర్రు శక్తీశ్వరస్వామి దేవాలయం లాంటి క్షేత్రాలు ఇక్కడ ఉన్నాయి.
ఇక్కడ మనకి స్వాతంత్ర్య సమరములో ఈ ప్రాంతానికి చెందిన దంతులూరి నారాయణ రాజు గారు , భూపతిరాజూ గారు , పెద సుబ్బరాజు గారు , అల్లూరి సీతారామరాజు ఇక్కడ ముందుండి సమరాన్ని నడిపించారు. అందుకు గాను గాంధీజీ గారు ఈ ప్రాంతానికి రెండవ బార్దొలి అని బిరుదును ఇచ్చారు ...
భీమవరంకు సమీపంలోని గరగపర్రు గ్రామంలో డా.పాలకోడేటి సత్యనారాయణశర్మ గారు ఉండేవారు. వీరు కూడా స్వాతంత్య్ర సమరకాలంలో మహత్మాగాంధీ పిలుపుమీద క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గ్గొని జైలుశిక్ష అనుభవించారు, అలాగే ఉప్పు సత్యాగ్రహం రోజుల్లో భీమవరం కేంద్రంగా ఉద్యమించిన శ్రీ పుచ్చలపల్లి సుందరయ్యగారి నేతృత్వంలో స్వచ్ఛంద సేవకులుగా ఉండేవారు.
#భీమవరంకి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో #మొగల్లు అనే గ్రామం ఉంది. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో తెలుగుజాతి, తెలుగు వారి శౌర్య పరాక్రమాలను ప్రపంచానికి చాటి చెప్పిన యోధుడు #అల్లూరి_సీతారామరాజు గారు. శ్రీ వెంకట్రామరాజు, నారాయణమ్మ దంపతులకు ఆయన జన్మించారు. వీరు మొగల్లు గ్రామంలో 1897 సంవత్సరంలో జన్మించారు. ఆయన పౌరుషం, ధైర్యం ఇక్కడ వారు వారసత్వంగా తీసుకున్నారు అని అంటారు అది నిజం కూడా
ఇకపోతే భీమవరం అనగానే మనకి గుర్తొచ్చేది నాన్ వెజ్ పచ్చళ్ళు ... ముందుగా మాంసం పచ్చడి పుట్టింది ఇక్కడే మాంసంతో పచ్చళ్లు పెట్టొచ్చు అని ప్రపంచానికి తెలియ చేసింది ఇక్కడివారే... ఇక్కడ మాంసం పచ్చళ్ళు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అండి ... ఇక్కడ ప్రాంతం పారిశ్రామికంగా కూడా చాలా ముందుంది విష్ణు సిమెంట్స్ , అంజనా సిమెంట్స్, నాగార్జున కాంట్రాక్షన్స్ తో పాటు మరెన్నో వ్యాపార సంస్థలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అనేక విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసినవి శ్రీ సాగి రామకృష్ణంరాజు ఇంజినీరింగ్ కళాశాల ( SRKR ),,, శ్రీ దంతులూరి నారాయణ రాజు కళాశాల ( DNR ) ,,, శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ ( Vishnu Eng Clz ) ఈ మూడు కళాశాలలు దేశంలోనే అత్యుత్తమ కళాశాలలుగా పేరుగాంచినవి.
భీమవరం అనగానే గుర్తొచ్చేది రొయ్యలు , చేపలు ... ఇవి ఇక్కడ ఎందుకు అంత ఫేమస్ అంటే ప్రపంచంలో అత్యధికంగా రొయ్యలు , చేపలు ఎక్స్పోర్ట్ చేసేది భీమవరం నుండే , మొదట్లో ఆంధ్రా లాస్ వేగాస్ అన్నాముగా అలా అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ ప్రపంచంలో ఎలాంటి కొత్త మోడల్ కార్ లు, బైక్ లు, ఫోన్ లు మరే ఇతరవి అయిన ముందు భీమవరంలోనే కనిపిస్తాయి మనకి అందుకే లాస్ వేగాస్ లాంటి రిచ్ సిటీ గా వర్ణిస్తారు. సంక్రాంతి వచ్చిందంటే అందరూ గోదావరి జిల్లాల వైపు చూస్తారు. అందులో ముందు చూసేది భీమవరం వైపే ఇక్కడ పందాలు ఏ రేంజ్ లో ఉంటాయి అంటే ఆ పందాలు జరిగే నాలుగు రోజుల్లో అక్కడ కనిపించే కార్లు అన్ని ఇన్ని కావు అన్ని కారు పార్కింగ్ కి పది రూపాయలు తీసుకున్నా ఆ మూడు రోజుల్లో ఈజీ గా ఒక 8 లక్షలు సంపాదించొచ్చు అండి. భీమవరంలో చెప్పుకోవాల్సింది
#గీతా_మల్టీఫ్లేక్స్ దీని గురించి కూడా చెప్పాలా అనుకుంటారేమో చెప్పాలి అండి ఎందుకంటే చుట్టు పక్కల చాలా గ్రామాలకు ఉన్న ఏకైక మల్టీఫ్లెక్స్ ఇది రోజుకి కనీసం ఒక ఐదు వందల సెల్ఫీ లు దిగుతారు అంటే నమ్మండి ( ఒకసారి నేను కూడా దిగాను అందుకె చెప్తున్నా ) అంత ప్రేమించేస్తారు ఈ మల్టీఫ్లేక్స్ ని
#భీమవరం గురించి చెప్పుకునే సందర్భంగా ముఖ్యంగా చెప్పుకోవలసి వారిలో శ్రీ యల్లా ప్రగడ సుబ్బారావు గారు ఎంతో మంది జీవితాలకు ఆదర్శం ఈయన. అంతటి గొప్ప వ్యక్తి 1895 సంవత్సరంలో భీమవరంలో జన్మించారు. ఎన్నో కష్టాలను ఛేదించి ప్రపంచం గుర్తించే స్థాయి వ్యక్తిగా ఎదిగారు. ఇంకా మరెందరో మహానుభావులు ఇక్కడ జన్మించి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఇక్కడ సినిమా రంగం కి చెందిన వ్యక్తులు కృష్ణంరాజు గారు, డైరెక్టర్ లు ; రాంగోపాల్ వర్మ , త్రివిక్రమ్ శ్రీనివాస్, కమిడియన్ సునీల్ , శివాజీ రాజా , ఎం.వి రఘు, హీరోయిన్ రాశి ఈ ప్రాంతానికి చెందిన వారే. రాబోవు రోజుల్లో మన హీరో ప్రభాస్ కూడా #భీమవరం అల్లుడు అవుతాడని టాక్ కూడా ఉంది.
భీమవరం కి 5 కిలోమీటర్ల దూరంలో పెదఅమిరం గ్రామం ఉంది ఇక్కడ ఆదినాథ్ భగవాన్ ( జైన్ ) దేవాలయం విశేషమైనది. పూర్తిగా పాలరాయితో నిర్మించిన ఈ దేవాలయం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడికి సుమారు 20 కి.మీ దూరంలో పేరుపాలెం బీచ్ ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా భీమవరంలో #మిక్సర్_బజ్జి చాలా ఫేమస్ అండి. భీమవరం వెళ్లిన ప్రతిఒక్కరు ఇక్కడ మిక్సర్ బజ్జి తినకుండా ఉండరు అంటే నమ్మండి. ఇంకా చెప్పవలసినవి చాలానే ఉంటాయి. ఏమైనా మిస్ అయితే మరోసారి వాటి గురించి చెప్తాను ( అలా చెప్పవలసినవి ఏమైనా ఉంటే కామెంట్ లో చెప్పండి )
భీమవరం పేరుకి రిచ్ అయినా ... ఇక్కడ మనుషుల మనసులు చాలా మంచివి అండి ... నమ్మితే తోడుగా నిలుస్తారు. చివరివరకు వదలరు ,,, మన అనుకుంటే పిలిచి ఆప్యాయంగా పలకరిస్తారు, వారి ప్రేమను ఆతిథ్యంలో చూపిస్తారు. తేడా వస్తే చుక్కలు కూడా చూపిస్తారు. ఇక్కడ వారు ప్రపంచం నలుమూలల కూడా ఉన్నారండోయ్ ఎక్కడికి వెళ్లినా అవునా మాది కూడా భీమవరమే అనే వాళ్ళు కచ్చితంగా మనకి కనిపిస్తారు. ఇక్కడ లేని సౌకర్యం లేదు అన్ని వసతులు ఉన్నాయి ఈ పట్టణంలో అదండి మరి భీమవరం గురించి. �

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

Bhimavaram andhra, భీమవరం

భీమవరం మరికొన్నివిశేషాల

Bhimavaram యొక్క కొన్ని ప్రత్యేకతలు :

పట్టణంలో పెద్దయెత్తున బియ్యం మిల్లులు, ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. చుట్టుప్రక్కల వరి వ్యవసాయం, చేపల పెంపకం బాగా వృద్ధి చెందింది.
సమీప ప్రాంతాలకు Bhimavaram ముఖ్యమైన విద్యాకేంద్రంగా ఉంది. రెండు ఇంజినీరింగ్ కళాశాలలు, మరెన్నో ఇతర విద్యా సంస్థలు ఉన్నాయి. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు ఇక్కడ టెయిలర్ ఉన్నత పాఠశాలలో చదివారు. సాహితీవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు చిలకమర్తి లక్ష్మీనరసింహం ఇక్కడి మిషన్ ఉన్నత పాఠశాలలో చదివారు.

భీమవరం to పెరుపలేం బీచ్

Perupalem Beach is located 35 kilometers away from Bhimavaram town which comes in the West Godavari area of the Andhra Pradesh state. Perupalem Beach is an amazing beach of Bhimavaram
పెరుపలేం బీచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి ప్రాంతంలో వచ్చే నరసపురం పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెరుపలేం బీచ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ యొక్క అద్భుతమైన బీచ్. ... పెరుపలేం బీచ్ బెంగాల్ బే యొక్క ఆకర్షణీయమైన నీలినీటిని అందిస్తుంది, ఇది పర్యాటకుల స్వర్గధామం ..
భీమవరం నుంచి రవాణా : బస్సు , ఆటో, ప్రైవేట్ వాహనములు అందుబాటులో ఉంటాయి

Bhimavaram, WEST GODAVARI DISTRICT pin-534201

Bhimavaram pincode : 534201old-memories-at-gobeest-sweet-reminders

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

MAHESH-BABU-GOBEST

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

వరలక్ష్మి వ్రతకల్పము,పూజ సామాగ్రి, వ్రత కద,  పూజ విధానము

చందన రూపుడు.. సింహాచలేశుడు.. ఏడాది మొత్తంలో 12 గంటలు మాత్రమే దేవుడి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది

మహిళా ‘అంబానీ’  రోష్ని నాడార్  37 ఏళ్లకే రూ.వేల కోట్ల సంపద!

DIWALI - దీపావళి పండుగ విశిష్టత మరియు లాభాలు.! "

beetroot

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

Media top

కాజల్ అగర్వాల్ 50 Photosఆంధ్ర ట్రాఫిక్ పోలీస్ వినూత్న ప్రయత్నం.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే ఈ నెంబరుకు వాట్సాప్ పంపొచ్చు!Gang Leader Trailer Talk: నాని ‘గ్యాంగ్ లీడర్’ ట్రైలర్ టాక్..సాహో బాక్సాఫీస్ కలెక్షన్ డే 2: ప్రభాస్ నటించిన చిత్రం ఒక రేంజ్ లో దూసుకుపోతున్నది


సాహో మూడు రోజుల్లో రూ.294 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రూ.300 కోట్ల దిశగా..సాహో’ హిందీ కలెక్షన్ అదుర్స్డబ్బుల పండుగ ఎగ్జిట్‌ పోల్స్‌ Effect రోజు మొత్తానికి రూ.5.33 లక్షల కోట్లు


గోబెస్ట్ నుంచి ఇప్పుడు అద్భుతమైన Online Shopping వివరాలు అందిస్తుంది. భారతదేశం లోని ప్రముఖ కంపనీల నుంచి ..


సాహో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ డే 4: ప్రభాస్ చిత్రం SAAHO.. రూ.294 కోట్లకు పైగా..హిందీ కలెక్షన్ అదుర్స్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, TIRUMALA

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet