Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

charmie kaur glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


Indian Women : భారతీయ మహిళ అంటే ప్రపంచ దేశాలు సైతము తలవంచిIndian traditional women - భారతీయ మహిళ

Indian traditional women - భారతీయ మహిళIndian Women : భారతీయ మహిళ

భారతీయ మహిళ అంటే ప్రపంచ దేశాలు సైతము తలవంచి నమస్కరించే కట్టుబొట్టుకు నిలయం. మన సంస్కృతిని, సాంప్రదాయపు అలవాట్లను, ప్రాచీన కాలం నుండి నేటి వరకు ప్రకృతిలా శోభాయమానమై పరవశింప చేసే తాను ఒక బృందావనం.
పురుషులతో ధీటుగా అన్ని రంగాలలోనూ ముందుకు దూసుకుపోతున్నది మన మహిళా లోకం. శాస్త్ర సాంకేతిక రంగాలలో, వైద్య విధాన క్రొత ఒరవడిలో, అంతరిక్ష పరిశోధనల పయనంలో, దేశ రక్షణ, కుటుంబ అవసరాలలో , నింగి నుండి నేల దాక తను చేయలేని పని అంటూ ఏది లేదని నిరూపించే సకల కళామ తల్లి మన స్త్రీ మూర్తి అని గర్వంగా చెప్పుకుందాం.
ఇంతటి గొప్ప మాతృమూర్తిని మనం మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్త్తూవుండడమే కాకుండా ప్రతి స్త్రీని నీచమైన దృష్టితో నేటికీ జరుగుతున్న సంఘటనలను రోజూ చూస్తూనే వున్నాము. తనకంటూ కొన్ని ఆశయాలు, అభిరుచులు వుంటాయని మరచి పోతున్నాము. కేవలం భార్య అంటే ఒక పిల్లలు కనే యంత్రమని, ఇంటి చాకిరి చేసే ఒక బానిస గానే నేటికీ చాలా ఇళ్ళల్లో చూస్తున్నాము. ఒకవైపు అమ్మగా, అక్కగా, చెల్లెళ్ళుగా, భార్యగా ఎన్నో రూపాలతో పురుషుని జీవితానికి తలమానికమై పకృతిలో పురుషుని ఎదుగుదలకు కారణభూతమైన స్త్రీ మూర్తికి ఏమిచ్చినా తీర్చుకోలేనిది తన ఋణం.
ఎంతో మంది స్త్రీలు ఉన్నత చదువులు చదివినా భర్త కట్టుబాట్లకు లోబడి ఇంట్లోనే జీవితం గడుపుచూ, వారి నైపుణ్యతను వంటింటికే పరిమితం చేసే ఈ వైనం కడు శోచనీయం. చదువుకునే రోజులలో తాను ఏదో సాధించాలన్న తపనతో సిద్దమైనా, పెళ్ళి అనే బంధంతో అన్నింటినీ వదులుకొని భర్త మాత్రమే దైవం అని నమ్మి నడిచి వచ్చిన ఒకే ఒక అమాయక ప్రాణం.
తనకంటూ ప్రత్యేక అవసరాలు లేవని, తన కుటుంబమే తనకు సంపద అని, భర్తే ప్రత్యక్ష దైవం అని, జీతం లేని పదవీ విరమణ రాని ఒకే ఒక ఉద్యోగిని. తన భర్త మిగిల్చిన అన్నం తిని అనురాగంలో మురిసి, తన పిల్లలు మిగిల్చిన అన్నం తిని ఆప్యాయతతో మైమరచి రేయనక పగలనక తన జీవితాన్ని క్రొవ్వొత్తిలా వెలిగించి తన కుటుంబం కొరకు తను కరిగిపోతూ వెలుగును ప్రసాదించే ఒక అమృత కళశం.
కాస్త మనశ్శాంతి కొరకు నేటి సోషల్ మీడియా వంటి ఫేస్ బుక్ వస్తే ఇక్కడ మాత్రం ఇంకా అరాచకం. వయసుతో నిమిత్తం లేకుండా, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా, మనకు కూడ అమ్మా, అక్కా చెల్లెళ్ళు, భార్య వున్నారు అనే ఇంగిత ఙ్నానం లేకుండా, పోస్ట్ లలో కాని, మెసెంజర్లలో కాని చెప్పుకోలేని రీతిలో మహిళలను వేధించే ఆకతాయి వెధవలతో మహిళలు నిత్యం మానసిక క్షోభకు గురి అవుతున్నారు. వారి మనసును తెలుసుకోలేక ఏడిపించే మేకవన్నె పులుల్లారా ఇకనైనా మీరు మారండి. ప్రతి మహిళను గౌరవించి మీలోని వ్యక్తిత్వానికి పది మందికి ఆదర్శం అవ్వండి.
చాలా మంది తమ బాధలు చెప్పుకోలేక ఈ ఫేస్ బుక్ వద్దు బాబోయ్ అంటూ కన్నీరు పెట్టించే చాలా కథలు వున్నాయి. మాయ మాటలతో అమాయకంగా నమ్మి,ధనం, మానం,ప్రాణం కూడా కోల్పోయిన సంఘటనలు వున్నాయి. ఆఫీసు పని మీద కాని, మార్కెట్టుకు కాని, చివరకి భగవంతుని దర్శనం కోరకు గుడికెళ్ళినా కాని ఇంటికి తిరిగి క్షేమంగా వస్తారని ఆశలు లేని నేటి సమాజం పూర్తిగా క్రూర నిలయం. ఇక కాలేజీ చదువులకు వెళ్లే అమ్మాయిల బాధ వర్ణణాతీతం. ఇకనైనా ఈ సంస్కృతి వీడి, అందరి పోస్ట్ లను చక్కగా ఆదరించండి. ఒక్కొక్కరు పెట్టే పోస్ట్ లలో వారి సందేశం గమనించండి. వారి అభిరుచులను మనం గౌరవిద్దాం. ఈ ముఖపుస్తకం ఒక చక్కని కుటుంబం అని తెలుసుకొని, ఎటువంటి కల్మషం లేని బంధాలకు పునాది వేద్దాం..
ప్రతి పరిచయానికి గౌరవంగా స్వాగతం పలుకుదాం..రక్త సంబంధం కన్నా ఈ స్నేహ బంధం గొప్పది అని ప్రతి స్త్రీ మనసులో చిరకాలం నిలిచి పోదాం..

అమ్మలు,అక్కలు,చెల్లెళ్ళు,స్నేహితులు మీరూ జాగ్రత్త...
Title :స్త్రీలు చేయ తగినవి. చేయ కూడని పనులు.
1) స్త్రీలు ఎప్పుడు గుమ్మడి కాయను కొట్టరాదు ఎందుకంటె గర్భ సంచి కిందికి జారిపోయే అవకాశములు ఎక్కువ
2).గర్భిణి స్త్రీలు శూర టెంకాయ తమిళంలో చిదరు కాయ్ అంటారు దానిని కొట్ట కూడదు ఎందుకంటె అడురుడుకు గర్భము జారిపోవచ్చు, అదే మాదిరి శూర టెంకాయ కొట్టే స్తలములో కూడా ఉండకూడదు.
3)గ్రహణ సమయమందు భూమ్యాకర్షణ శక్తి మార్పు చెందుతుంది. దాని పరిమాణము మనపై చాల ఉంటుంది ముఖ్యముగా మన కడుపులో ఆహార పదార్థములు జీర్నమవడానికి కావలసిన ఆమ్లములు ఉరవు అందువల్ల జీర్ణము కాదు ఈ కారణముగానే గ్రహణ సమయమునకు ముందుగ మూడు గంటలకు పూర్వమే మన కడుపులో ఏమి ఉండకూడదు అంటారు
4)మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు.. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును
5)మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.
6)మీరు మీ పిల్లలో దిండు పైన కూర్చో వద్దు అయితే ఈ కాలములో అందరు దీనిని తప్పక చేస్తుంటారు.
7)స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు
దుఃఖం విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు.
అలాగే వారు పోయేటప్పుడు వెల్లివస్తానని చెప్పా కూడదు ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారినిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు పరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది.
8)కోత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక ముల రాయాలి పసుపు క్రిమినాసిని.
9) ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోడదు అయితే ఈ మధ్య కాలములో ఈ పని చాల చోట్లలో సహజమై పోయింది.
10) నలుపు రంగు వస్తువులు బట్టలు దరించ కండి ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.
11) ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన చేతిలో ఇవ్వకూడదు కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు ఈ మద్య కాలంలో ఉప్పు చేతితో వడ్డించడం చాల చోట్లలో గమనిస్తాము.
12) ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి ఇది పితృ దేవతలకు ప్రీతి కాకికి మనము భోజనము చేయుటకు ముందు కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది.అది తప్పు.
13) టెంకాయ చిప్ప తామ్బులము ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.
14) స్త్రీలు ఎప్పుడు జుట్టు విరవ పోసుకొని ఉండకూడదు ఇది జ్యేష్టాదేవి స్వరూపము ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది ఈ చర్య ప్రతి గృహములో ఇప్పుడు ఒక తప్పని సరి అయిపొయింది.అలా చేయరాదు.
15) శుక్రవారంనాడు గాని జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పైపై డబ్బులు చేరటానికి అవకాశం ఎక్కువ.
16) కాలిపై కాలు వేసుకొని కుర్చోవడము, కాళ్ళని ఆడిస్తూ కూచోవడం ఒంటి కాలితో నిలవడం స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా అవహేళన చేసే అవకాశములు ఎక్కువగా ఉంటాయి.
17)ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.
18) సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ఆహారము తినకుండా నిద్రించ కూడదు.లేదా అల్పాహారం అయిన తీసుకోవాలి.
19)స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు
20) పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు రేపు తీసుకుంటాను అని అనవలెను.
21) ఎప్పుడు మన నోటినుండి పీడ దరిద్రం శని పీనుగా, కష్టము అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.. ఇంటిలో దుమ్ము ధూలి సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువు పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.
22)కర్మ దినమందు ఇంటి ముందు ముగ్గు ఖర్మ అయ్యేవరకు వేయకూడదు ఖర్మనంతరం ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను.
23)దిండు ఓర దుప్పట్లు అప్పుడప్పుడు ఉతుకుతూ వాడాలి మనకు తెలియని సుక్ష్మ క్రిములు చాల ఉంటాయి దాని వాళ్ళ మనకు హాని జరుగును.
24) అతి ముఖ్యమైనది ఏ వ్యవరమైన ముందు ,భర్త,తరువాత పిల్లలకు చెప్పండి.ఇలా కాకుండా ముందు టీవీ సీరియల్స్లో నటించే మాదిరిగా మీ అమ్మ,నాన్న కు చెప్పొద్దు,తరువాత భర్తకు చెప్పటం చేయరాదు ,అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు,లేదా మీ జీవితాలు (అంతరంగాలు అనంత సాగర చదరంగాలు)అని మీ ఇంటికి వెళ్లి మీ అమ్మ,నాన్నతో పాడుకోవాలిసి వస్తుంది. ఈ మధ్య ఇంటిలో కాళిగా ఉన్నా ఆడవాళ్లు,ఏమి తోచక,టీవీ ల మోజులో పడి, ఏమి చేస్తున్నారో...ఏమి చూస్తాన్నారో..ఒకటి సందేశాత్మకం కాదు,వాటిలో..భర్తను ఎలా వదిలించుకోవాలి?అత్తను ఎలా చంపాలి?ప్రియుడును ఎలా దక్కించుకోవాలి?చివరిగా ఒకటి అర్ధం అయింది?ఆడవారు గాలిపటంలాంటి వారు,మగవాడు దారం అని తెలుసుకోలేకపోతే..ఎలా? Music Womens Special


Indian Women Special : భారతీయ మహిళGOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet