Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


బ్లాక్‌ టీ కేవ‌లం అందానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిదే..! BALCK TEA ప్రస్తుతం మనం రోజూ వారి జీవితంలో మన ఆరోగ్యన్ని రక్షించుకోవడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, అందులో సహజమైన,పద్దతిలో, అందరికీ, అతి తక్కువ ఖర్చుతో లభించేది ఈ గ్రీన్ టీ, ఇది ఎప్పటినుంచో ఆరోగ్య సం రక్షణలో ఎంతోగానో ఉపయోగపడుతుంది,అధిక బరువుని తగ్గించడమే కాకుండా ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎన్నో అద్భుతాలు చేస్తుంది.అవి ఏంటో చుసేద్దామా:



black tea

బ్లాక్‌ టీ ఆరోగ్యానికి చాలా మంచిది . అసలు బ్లాక్‌ టీఅంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి.
ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

బ్లాక్‌ టీ : పాలు గాని క్రీం గాని కలపుకుండా Camellia sinensis ఆకులనుండి తయారు చేస్తారు. ఒక కప్పు టీని తయారు చేయాలంటే 50-60 మి.లీ నీటినో కావసినంత టీ పొడి (ఒక టీ స్పూన్‌) ని వేసి బాగా 30-40 మి.లీ వరకూ బాగా మరిగించాలి. కేలరీలు ఉండకూడదనుకుంటే ... జీరో సుగర్ ఫ్రీ కొద్దిగా కలిపి తాగవలెను.
మీరు రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే, మీరు రోజూ కనీసం మూడు కప్పుల బ్లాక్‌ టీ తాగాలని, దీని వల్ల రక్తపోటు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రోజూ మూడు కప్పుల బ్లాక్‌ టీ తాగేవారిలో రక్తపోటు తగ్గిందని యూనివర్శిటీ ఆఫ్‌ వెస్టర్న్‌ ఆస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు. అయితే రక్తపోటు పూర్తిగా తగ్గలేదు కానీ కొద్దిగా తగ్గింది. దీని ప్రభావం గుండెపోటుకు దారితీసే అధికరక్తపోటు సంభ్యావతపైఉంటుంది. ' స్వల్పంగా తగ్గినా, అధిక రక్తపోటు వచ్చే అవకాశం పదిశాతం, గుండెపోటు, పక్షవాతం ప్రమాదం 7 నుంచి 10 శాతం తగ్గుతుంది' అని అధ్యయన రచయిత జొనాథన్‌ హడ్‌సన్‌ తెలిపారు.
క్రమం తప్పకుండా టీ తాగే 95 మందిలో రక్తపోటుపై బ్లాక్‌ టీ ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై అధ్యయనం చేశారు. అధ్యయనం మొదలుపెట్టిన తర్వాత వారి సగటు సిస్టాలిక్‌ రక్తపోటు (రక్తపోటు విలువలోని పై సంఖ్య) 115 నుంచి 150 మధ్య ఉంది. అధ్యయనంలో పాల్గొన్న సగం మంది ఆరు నెలల పాటు రోజూ మూడు కప్పుల బ్లాక్‌ టీ తాగారు. మిగతా సగం మంది అదే రుచి, కెఫీన్‌ ఉండే దాన్ని తీసుకున్నారు. రెండు గ్రూపుల్లోని వారి లింగం, వయసు, బరువు సమానంగా ఉన్నాయి. బ్లాక్‌ టీ తాగిన వారిలో 24 గంటల్లో సిస్టాలిక్‌ రక్తపోటు సగటున రెండు నుండి మూడు పాయింట్లు తగ్గింది. డయాస్టిలిక్‌ రక్తపోటు (రక్తపోటు విలువలో కింద ఉండేది) రెండు పాయింట్లు తగ్గింది. మొదటి సారి దీర్ఘకాలం బ్లాక్‌ టీ తీసుకోవడం వల్ల సాధారణం నుంచి ఎక్కువ సాధారణం రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటు తగ్గడం కనిపించిందని పరిశోధకులు తెలిపారు. బ్లాక్‌ టీ తాగడం వల్ల ఎండోథీలియల్‌ కణాల పనితీరు మెరుగవుతుందని ఈ మధ్య జరిగిన అధ్యయనాలు సూచించాయి. ఎండోథీలియల్‌ సరిగ్గా పనిచేయకుంటే రక్తపోటులో మార్పులు వస్తాయి. బ్లాక్‌టీలోని ఫ్లవనాయిడ్స్‌ రక్తనాళాల స్థితిని మెరుగుపరుస్తాయని, బరువు, పొత్తికడుపులోని కొవ్వును తగ్గిస్తాయని ఇంకో పరిశోధన వెల్లడించింది. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవన విధానం వల్ల ఒత్తిడి, అధిక బరువు, అధిక పొట్టతో చాలా మంది బాధపడుతున్నారు. అందుకు ఎన్నో రకాల ప్రయాత్నాలు చేసి ఇప్పుడు గ్రీటీ, బ్లాక్ టీ వెంట పడ్డారు. ఆఫీసుల్లో పనిచేసే వారికి గ్రీన్ టీ ఒక ఆరోగ్యం మంత్రంగా మారింది. ఎందుకంటే ఈ టీలల్లో అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కనుక. కాఫీ బ్రేక్ వచ్చిందంటే చాలు టీబ్యాగ్స్, కప్పులతోటి హ్యాపీగా గ్రీన్ టీ, బ్లాక్ టీ లు తాగేస్తుంటారు. గ్రీన్ టీ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ఇండియాలోనే కాదు ప్రపంచ మొత్తంగా బ్లాక్ టీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఎందుకంటే తాజా అధ్యయనం ప్రకారం బ్లాక్ టీలో కాసింత వేడిపాలును కలుపుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు గుండె జబ్బులను దూరం చేస్తుందని టీ అడ్వైజరీ ప్యానెల్ తెలిపింది. గ్రీన్ హెల్త్ ప్రాపర్టీస్, బ్లాక్ టీ ప్రాపర్టీస్‌పై జరిగిన పరిశోధనలో గ్రీన్ కంటే బ్లాక్ టీ ఎంతో మేలు చేస్తుందని పరిశోధనలో తేలింది. దీనిపై ఫ్రీలాన్స్ డైటీషియన్ డాక్టర్ క్యారీ రక్స్‌టన్ మాట్లాడుతూ..
గ్రీన్ టీ కంటే.. బ్లాక్ టీని సేవించడం వల్ల క్యాన్సర్, స్ట్రోక్, డయాబెటీస్, నోటి సమస్యలు వంటివి తగ్గుతాయన్నారు. అయితే తమ అధ్యయనం రెండు రకాల టీలపై సాగినట్టు చెప్పారు. ఇందులో ఒకే తరహా ప్రతిఫలాలు ఉన్నట్టు తేలిందన్నారు. బ్లాక్ లేదా గ్రీన్ టీ తాగే వారిలో ఎక్కువగా గుండెపోటులు చాలా వరకు తగ్గినట్టు ఆయన తెలిపారు. ప్రతిరోజూ బ్లాక్ టీ తాగడం ద్వారా రక్తపోటుకు చెక్ పెట్టవచ్చునని తాజాగా నిర్వహించిన ఆస్ట్రేలియా అధ్యయనంలో తేలింది.
మొత్తం 95 మంది ఆస్ట్రేలియన్లను రెండు గ్రూపులు తీసుకుని బ్లాక్ టీ, కాఫీ సేవింప చేశామని పరిశోధకులు జోనాథన్ హడ్గ్సన్ తెలిపారు. ఇందులో బ్లాక్ టీ తాగే గ్రూపుకు రక్తపోటు సమస్య చాలా మటుకు తగ్గిందని తేలింది. ఆరునెలల పాటు జరిగిన ఈ పరిశోధనలో బ్లాక్ టీ తాగే వారిలో రక్తపోటు తగ్గిందని, కాఫీ తాగిన వారిలో రక్తపోటు సమస్య పెరిగినట్లు తేలిందని జోనాథన్ వెల్లడించారు. కాబట్టి బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగాలని ఎవరైనా చెబితే ఏదో పిచ్చి చిట్కాలని కొట్టిపారేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు అందుకు శాస్త్రీయ ఆధారం లభించింది. ఆహారంలో బ్యాక్టీరియా కారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లకు టీ ఒక చక్కటి విరుగుడు అని దక్షిణ భారత దేశంలో టీ మీద జరుగుతున్న జాతీయ సమావేశాల్లో శాస్త్రవేత్తలు చెప్పారు. టీ సర్వరోగ నివారిణి కాకపోయినా ఫ్లూ, ఆహార నాళం, పొట్ట కేన్సర్లను నయం చేసే గుణాలు టీలో ఉన్నాయి. ఎందుకంటే టీలో ఉండే పాలీ ఫినాల్స్ అనే పదార్థాలు మనకు తెలిసిన యాంటీ ఆక్సిడెంట్లకంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయట. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయని కూడా చెబుతున్నారు.
అంతేనా.. ఈ పాలీ ఫినాల్స్ దంతాలకు కూడా మేలు చేస్తాయట. పాచి పట్టకుండా ఆపడమే కాక, పళ్ల మీది ఎనామిల్‌ను గట్టిపరుస్తాయి. జపాన్, చైనాల్లో భోజనం తరువాత ఒక కప్పు గ్రీన్ టీ తాగిన పిల్లల్లో ఈ లక్షణాలన్నింటినీ కనుగొన్న శాస్త్రజ్ఞులు వాటికి కారణం టీలోని పాలీ ఫినాల్సేనని తేల్చారు.
టీ తాగితే మన మెదడులో చురుకుదనం కూడా పెరుగుతుందట. 44 మంది యువకులపై జరిపిన అధ్యయనంలో టీలో ఉండే అమినో యాసిడ్ ఎల్-థియానైన్ మెదుడు చురుకుదనాన్ని పెంచిందని తేలింది. అలసటను కూడా తగ్గించిందట. మొత్తానికి బ్లాక్ టీ తాగితే ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందని, గ్రీన్ టీ తాగితే మెదడు చురుగ్గా పని చేస్తుందని, మొత్తానికి క్రమం తప్పకుండా టీ తాగేవారిలో శారీరక ఆరోగ్యం బాగుంటుందని తేల్చారు. రోజూ మూడు కప్పుల టీ తాగండి. అది గుండె జబ్బుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అవును... మీరు చదివింది నిజమే. ఈ విషయం పరిశోధనల్లో వెల్లడయింది. బ్లాక్ టీ లేక గ్రీన్ టీని రోజూ మూడు కప్పులు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పదకొండు శాతం మేరకు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఫ్యాట్, కొలెస్టరాల్ కలయిక మూలంగా ఏర్పడే ఫలికకలను రక్తనాళాలో డెవలప్ అయ్యే అవకాశాలను టీ తగ్గిస్తుంది. ‘టీ'లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. రెండు యాపిల్స్ లో, ఐదు రకాల కూరగాయల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రెండు కప్పుల టీలో లభిస్తాయి. ఈ తాజా పరిశోధనాంశాలను యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు. టీ లుండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కార్డియోవాస్క్యులర్ డిజీజెస్ రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. బ్లాక్ టీలో ఉండే ప్లేవనాయిడ్ ఎంత ఉంటుందో అంతే మోతాదులో గ్రీన్ టీలో లభిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. టీ, టీలో ఉండే ప్లేవనాయిడ్స్ నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని, ఎండోథీలియల్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసే వాటిలో ఇవి కూడా కీలకపాత్ర పోషిస్తాయి. తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి. ‘టీ' తీసుకున్న వారిలో గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడటం చాలా తక్కువగా కనిపించింది. టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్ ఎథెరోస్కెలెరోసిన్ పెరుగుదలను నిరోధిస్తోంది. అని పరిశోధనలో పాల్గొన్న డా. కేథరిన్ హుడ్ అభిప్రాయపడ్డారు.
టీ తాగడం వల్ల మరికొన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

బ్లాక్‌ టీ కేవ‌లం అందానికే కాదు.. ఆరోగ్యానికీ మంచిదే..! BALCK TEA

BLACK TEA

1. రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి.
2. బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు.
3. రోజూ మూడు నాలుగు కప్పుల టీ తాగేవారిలో గుండె పోటు ప్రమాదం 21 శాతం తగ్గుతుంది.
4. టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.
5. గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడునుప్రశాంతంగా ఉంచుతుంది.
6. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి.
7. అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు.
8. టీ డీహైడ్రేషన్‌ సమస్యనూ దూరం చేస్తుంది. నీరు తాగేందుకు దోహదం చేయును.

THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/ INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDE RANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.

ravi shastri

అకకరకాయ బోడ కాకర అని కూడా పిలుస్తారు

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet