Kajal Agarwal Telugu Actress, Tollywood Actress kajal agarwal

కాజల్ అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ఊర్వశి రౌతాల

Nidhi Agarwal

నిధి అగర్వాల్

ఊర్వశి  రౌతాల Urvashi Rautela turns up the heat with her glamorous photoshoots

ప్రియాంక చోప్రా

Pooja-hegde

పూజ హెగ్డే

natu vaidyam kalabanda- aloe veera

ఔషధం - కలబంద


చక్కని అందానికి, ఆరోగ్యానికి ఆపిల్ పండు
రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదు, వందేళ్ల జీవితానికి డోకా ఉండదు



apple-fruit-gobest

రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం లేనట్లే...! ఈ సామెత మనందరికి తెలిసన విషయమే, అయితే మనలో ఎంత మంది ఈ విషయాన్ని నమ్మతారు, ఆచరిస్తారు?ఎంత మంది ఆపిల్ ను ప్రతి రోజూ తింటారు? నాకు తెలిసి ప్రతి రోజూ రెగ్యులర్ ఆపిల్ తినే వారు తక్కువే అని చెప్పవచ్చు! అలాంటి వారికోసం ఈ ఆర్టికల్.
ఇందులోని గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ తెలుకుంటే చాలు, ఇక ఈ రోజు నుండే ఆపిల్ తినడం మొదలు పెడతారు. ప్రపంచంలో అత్యధికంగా పండించే పంట మరియు ఎక్కువగా తినగలిగే హెల్తీ అండ్ న్యూట్రీషియన్ ఫ్రూట్. ఒక విధంగా చెప్పాలంటే ఇందులోని అద్భుతమైన ప్రయోజనాలను బట్టి ఇది ఒక అద్భుతమైన పండు అని చెప్పవచ్చు . ఎందుకంటే యాపిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్, మరియు వ్యాధులను వ్యతిరేకించే గుణాలు మెండుగా ఉన్నాయి. ఈ గుణాలన్నీ నివారిణులుగా మరియు ఇక్సిడేషన్ డ్యామేజ్ కలగకుండా మరియు శరీరంలోని కణాల పునరుత్పత్తికి గ్రేట్ గా సహాయపడుతాయి.
1. తళతళలాడించే తెల్లటి దంతాల కోసం: ఆపిల్ ను తినడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది దంతక్షయాన్ని నివారించడంతో పాటు నోట్లో బ్యాక్టీరియా లెవల్స్ ను తగ్గిస్తుంది. వందేళ్ల జీవితానికి.
2.మతిమరుపును నివారిస్తుంది: ప్రతి రోజూ యాపిల్ జ్యూస్ త్రాగడం వల్ల అల్జైమర్స్(మతిమరుపు నివారిస్తుంది). రీసెంట్ గా జరిపిన పరిశోధన ప్రకారం రెగ్యులర్ గా ఆపిల్ జ్యూస్ త్రాగడం వల్ల బ్రెయిన్ కు సంబంధించిన ఎలాంటి సమస్యలనైనా నివారిస్తుందని వెల్లడి చేశారు.
3. పార్కిసన్స్ కు వ్యతిరేకంగా పోరాడి, రక్షణ కల్పిస్తుంది: కొన్ని పరిశోధన ప్రకారం ఆపిల్స్ తో పాటు, ఇతర ఫైబర్ ఫుడ్స్ ను తినడం వల్ల పార్కిసిన్స్ వ్యాధిని నివారించుకోవచ్చు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ యొక్క ఫ్రీరాడికల్ పవర్ పుష్కలంగా ఉండంటం వల్ల ఇది వ్యాధినిరోధకతగా పనిచేస్తుంది.
4. అన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది: ఆపిల్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల ప్యాక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తుంది . ఆపిల్ తొక్కలో ఉండే ట్రైటర్ఫినాయిడ్ కాంపౌడ్స్ లివర్, కోలన్, మరియు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ ను నివారిస్తుంది ఆపిల్స్ తినడానికి ఇది ఒక హెల్తీ కారణం.
5. డయాబెటిక్ రిస్క్ ను తగ్గిస్తుంది: ముఖ్యంగా మహిళలు ఎవరైతే యాపిల్స్ రెగ్యులర్ గా తింటారో అలాంటి వారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాపిల్స్ లో ఉండే సోలబుల్ ఫైబర్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.
6. హార్ట్ హెల్త్: ఆపిల్స్ లో అధికంగా సోలబుల్ ఫైబర్ ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ లెవల్స్ అధికం కాకుండా నివారిస్తుంది . అలాగే ఆపిల్ తొక్కలో ఉండే పినాలిక్ కాంపౌండ్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారిస్తుంది . రక్తనాళాల గోడలమీద కొలెస్ట్రాల్ ఏర్పడటం వల్ల రక్తప్రసరణను ఆలస్యం చేస్తుంది. దాంతో గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి.
7. డయోరియా మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది: మలబద్దకం మరియు డయోరియా వంటి వాటకి ఆపిల్స్ బెస్ట్ హోం రెమెడీగా పనిచేస్తుంది. యాపిల్స్ లో ఉండే ఫైబర్ కంటెంట్ క్లోమంలో వాటర్ శాతాన్ని పెంచడం లేదా తగ్గించడం వల్ల బౌల్ మూమెంట్ జీవక్రియలు సరిగా జరగడానికి సహాయపడుతుంది. అందుకే ఇది ఒక హెల్తీ చాయిస్ ఫుడ్.
8. బరువును కంట్రోల్ చేస్తుంది: హార్ట్ డిసీజ్, నిద్రలేమి, హైబ్లడ్ ప్రెజర్, డయాబెటిస్ ఇవన్నీ అదనపు బరువు పెరగడానికి కారణాలుగా ఉన్నాయి. యాపిల్స్ రెగ్యులర్ గా తినడం వల్ల హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతాయి. యాపిల్స్ లో ఉండే ఫైబర్ ఎక్కువ సమయం ఆకలి అవ్వకుండా చేస్తుంది.
9. కాలేయాన్ని డిటాక్సిఫై చేస్తుంది: సాధారణంగా మనం తీసుకొనే ఆహారాల ద్వారా కూడా టాక్సిన్స్ మన శరీరంలో చేరుతాయి. కాలేయం టాక్సిన్స్ ను తొలగించడానికి బాధ్యత వహిస్తుంది . కాబట్టి, రెగ్యులర్ గా ఆపిల్స్ తినడం వల్ల శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టివేయవచ్చు.
10. మెటబాలిజం సిండ్రోమ్ నుండి రక్షణ కల్పిస్తుంది: ఎవరైతే ఆపిల్స్ అధికంగా తింటారో అలాంటి వారిలో మెటాబాలిజం సిండ్రోమ్ తో చాలా తక్కుగా బాధపడుతారు . ఇది హార్ట్ డిసీజ్ కు సంబంధించినది మరియు డయాబెటిస్ కు కారణం అవుతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఆపిల్ తినడం వల్ల ఇది మరో గొప్ప ప్రయోజనం.

green-apple-fruit-gobest

Green Apple-గ్రీన్ ఆపిల్
జుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదు" అని ఒక సామెత ఉన్నది. అయితే ఖచ్చితంగా ఆకుపచ్చ ఆపిల్ లో ఈ వాస్తవం కలిగి ఉంది. ఆపిల్ అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. అత్యంత అసాధారణ మరియు అద్భుతమైన పండ్లలో ఒకటిగా ఉన్నది. ప్రతి వ్యక్తి తమ రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. దీనిలో అవసరమైన పోషకాలు మరియు చాలా విటమిన్లు ఉంటాయి. ఆపిల్స్ లో చాల రకాలు ఉన్నాయి. సాదారణంగా ఎరుపు మరియు ఆకుపచ్చ ఆపిల్స్ పుల్లని మరియు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి. గ్రీన్ యాపిల్ దీర్ఘ కాల ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది అంతర్లీన ప్రోటీన్లు, విటమిన్లు,ఖనిజాలు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ లోపాలు నుండి ఉపశమనం మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం,BP తగ్గించడం,రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం & ఆకలి మెరుగుపరచడం వంటి వాటికీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.
సూపర్ మర్కెట్ లో నేడు ప్రత్యేకం గా కనిపిస్తున్న పండ్లలో ఒకటి " గ్రీన్‌ యాపిల్ " సాధారణ యాపిల్ పండు రంగుకు భిన్నం గా కనిపించే ఈ యాపిల్ పండును చూసిన చాలా మంది అది పచ్చి యాపిల్ గా భావించే అవకాశముంది. అయితే ఈ పచ్చ యాపిల్ పండుకు మన దేశములో లభించే యాపిల్ పండుకు సంబంధములేదు. లేత ఆకుపచ్చ రంగులో నిగనిగ లాడుతూ కనిపించే ఈ గ్రీన్‌ యాపిల్ ఆస్ట్రేలియా కు చెందిన యాపిల్ . పండ్ల అన్నింటా అత్యంత అధిక ఆరోగ్యాన్ని అందించే పండు గా దీనిని పేర్కొంటారు. ఇతర యాపిల్ పండుకు దీనికి జన్యుపరంగా అంతగా తేడాలు లేకపోయినా రుచి విషయము లో స్పస్టమైన తేడా ఉంది. సిమ్లా యాపిల్ పండులా గ్రీన్‌ యాపిల్ లో తియ్యదనము ఉండదు. కొంత వగరు రుచి కలిగి ఉంటుంది. ఈ రుచి వల్లనే దానికి ప్రత్యేకత సంతరించుకుందంటారు. . . వ్యాపారులు . సిమ్లా యాపిల్ కు గ్రీన్‌యాపిల్ కు ముఖ్యమైన తేడా దాని రంగు . యాపిల్స్ లో ఎరుపు , గ్రీన్‌ తరహావే కాక పసుపు రంగు యాపిల్స్ కూడా ఉంటాయి. వీటిలో దేని రుచి దానిదే.

Some facts about Apples:

ఎక్కువ ఫైబర్ కంటెంట్ : దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండుట వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపర్చడానికి సహాయపడి తద్వారా జీవక్రియను పెంచుతుంది. అందువలన ఇది స్వేచ్ఛా ప్రేగు కదలికలో సహాయపడుతుంది. ఆపిల్ ను దాని చర్మంతో సహా తినటం ఎల్లప్పుడూ మంచిది. మీ ప్రేగు మరియు వ్యవస్థలను శుభ్రపర్చి మీరు సంతోషముగా మరియు ఆరోగ్యవంతులుగా ఉండటానికి సహయ పడుతుంది.
ఖనిజాల కంటెంట్ : ఇనుము,జింక్,రాగి,మాంగనీస్,పొటాషియం
మొదలైన ఖనిజాలను కలిగి ఉంటుంది. మానవ ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఖనిజాల మీద ఆదారపడి ఉంటుంది. ఆపిల్ లో ఉన్న ఇనుము రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక జీవక్రియ రేటు పెంచటానికి సహాయపడుతుంది.
తక్కువ కొవ్వు కంటెంట్ : బరువు తగ్గాలని అనుకొనే వారికీ గొప్ప ఆహారం అని చెప్పవచ్చు. ప్రతి వ్యక్తీ తమ రోజు వారి ఆహారంలో తప్పనిసరిగా ఆపిల్ ఉండేలా చూసుకోవాలి. ఇది రక్తనాళాలలో కొవ్వును సేకరిస్తుంది. అంతేకాక స్ట్రోక్స్ అవకాశాలు నివారించడం,గుండెకు సరైన రక్త ప్రవాహం నిర్వహణలో సహాయపడుతుంది.
చర్మ క్యాన్సర్ నిరోధిస్తుంది : దీనిలో విటమిన్ C ఉండుటవల్ల ఫ్రీ రాడికల్స్ ద్వారా చర్మ కణాలకు వచ్చే నష్టాన్నినిరోధించడంలో సహాయపడుతుంది. అందువలన చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
సమృద్ధిగా యాంటీ ఆక్సిడంట్ : యాంటీ ఆక్సిడంట్ లు కణాల పునర్నిర్మాణం మరియు కణాల పునరుత్తేజం నకు సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మ నిర్వహణలో కూడా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడంట్ మీ కాలేయం రక్షించడానికి మరియు దాని యొక్క సరైన కార్యాచరణ నిర్ధారించడానికి సహయపడతాయి.
ఆరోగ్యకరమైన,బలమైన ఎముకలు : ఇది థైరాయిడ్ గ్రంథి సరైన కార్యాచరణకు సహాయం చేయడం ద్వారా కీళ్లవ్యాధులను నిరోధిస్తుంది.
అల్జీమర్ నిరోధిస్తుంది : ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే అల్జీమర్ వంటి వృద్ధాప్య నరాల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని అడ్డుకుంటుంది.
ఆస్త్మా నిరోధిస్తుంది : క్రమం తప్పకుండా ఆపిల్ రసం తీసుకుంటే తీవ్ర సున్నితత్వం కలిగిన అలెర్జీ రుగ్మత అయిన ఆస్త్మాని నిరోధించటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
డయాబెటిస్ నిరోధిస్తుంది : యాపిల్స్ మధుమేహంను నిరోధిస్తుంది. ఇది మధుమేహం కోసం తప్పక కలిగి ఉండాలి.సమృద్ధిగా విటమిన్ A,B మరియు C ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాల నుండి చర్మంను రక్షించటానికి గ్రీన్ ఆపిల్ లో విటమిన్లు A,B మరియు C సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక ప్రకాశించే చర్మం నిర్వహించడం కొరకు సహాయపడుతుంది.
మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడు : మహిళల్లో ఒత్తిడి శాతం పెరిగిపోయి అది క్రమంగా మైగ్రేన్‌ తలనొప్పిగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదని వెైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు అటువంటి మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడుగా ఆకుప చ్చని యాపిల్స్‌ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని తింటే మైగ్రేన్‌ తలనొప్పిని దూరం చేయవచ్చని వెైద్యు లు చెబుతున్నారు.

THE CONTENT ON THIS BLOG/SITE ARE THE COLLECTION/GATHERING OF DATA/LINKS/ MATERIALS/ INFORMATION ETC, THAT ARE FREELY AVAILABLE ON THE INTERNET AND ITS WIDE RANGE OF RESOURCES. IF ANY OF THE CONTENT/DATA ETC ON THIS BLOG/SITE ARE OBJECTIONABLE OR VIOLATING ANY COPY RIGHTS, ACTS ETC, THE SAME WILL BE REMOVED AS SOON AS ANY COMPLAINT RECEIVED AND THE AUTHOR IS NOT RESPONSIBLE FOR ANYTHING.

boppayi papaya health benefits

చక్కని అందానికి, ఆరోగ్యానికి బొప్పాయి…

క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది

World Cup 2019: Most Runs, Most Wickets and Points Table

GOBEST CINEMAS
           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow Youtube twitter-gobest-best-follow-tweet