Gobest.in: Best Health Benefits Of Fish : చేపల్లో ఆరోగ్యానికి కావల్సినన్ని పోషకాలున్నాయి.


సీఫుడ్ అంటే మీకు అభిమానమా ? ఒకవేళ అవును అయితే, మీకొక శుభవార్త. చేపల రుచులను ఆస్వాదించడం మాత్రమే కాకుండా, మీరు వాటిని ఎక్కువగా వినియోగించడానికి గల ఆరోగ్య కారణాలను కూడా అధికంగా కలిగి ఉన్నారు! శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న ఆరోగ్యవంతమైన ఆహారాల్లో చేపలు కూడా ఒకటి. ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ముఖ్యమైన మరియు ఆవశ్యక పోషకాలతో లోడ్ చేయబడి ఉండడమే కాకుండా, ఇనుము, జింక్, అయోడిన్, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలకు కూడా గొప్ప వనరుగా చేపలు ఉంటాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి అత్యావశ్యక పోషకాల యొక్క అత్యుత్తమ వనరుల్లో చేపలు కూడా ఒకటి. ఇవి మీ శరీరంలోని కొవ్వునిక్షేపాలను అదుపులో ఉంచడమే కాకుండా శరీరంలోని జీవక్రియలు మరియు ఆలోచనా శక్తిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. క్రమంగా శరీర నిర్మాణంలో కీలకపాత్ర పోషించగలదని చెప్పబడుతుంది.
చేపలు తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు : చేపలను క్రమంతప్పకుండా తీసుకోవడం మూలంగా మీ నడుము నాజూకుగా, మంచి ఆకృతిని పొందడమే కాకుండా, కాలేయం, మెదడు మొదలైన ఇతర అవయవాల పనితీరు మెరుగుపరచడంతో సహా అనేక ఇతరత్రా శారీరిక విధులలో కూడా సహాయపడగలదు. మరియు మీరు ప్రశాంతమైన నిద్రను పొందడంలో సహకరిస్తుంది. క్రమం తప్పకుండా, తరచుగా చేపలను తీసుకోవడం ద్వారా కొన్ని వ్యాధులకు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యల ప్రమాదం తగ్గుతుంది.DOUBLE FITNESS

1. అల్జీమర్స్ వ్యాధి రాకుండా …

2016 లో జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, ఒక క్రమప్రాతిపదికన చేపలను తీసుకోవడం, మానవ మెదడులోని "గ్రే మాటర్" మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మెదడు కణాల క్షీణతను నిరోధిస్తుంది మరియు వృద్ధాప్యం సమయంలో మెదడు విధులను నిర్వహించడంలో సహాయపడుతుంది. క్రమంగా అల్జీమర్స్ వ్యాధి రాకుండా, అరికట్టగలుగుతుంది.

2. గుండె జబ్బులను తగ్గిస్తుంది :

అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, ఒక క్రమ ప్రాతిపదికన చేపలను తరచుగా తీసుకోవడం మూలంగా గుండె వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చునని చెప్పబడుతుంది. చేపల్లో కనిపించే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలోని ట్రైగ్లిజరైడ్లను తగ్గించడం ద్వారా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచగలవని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అంతేకాకుండా రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించి, క్రమంగా రక్తపోటును కూడా తగ్గించే అవకాశం ఉన్నట్లుగా చెప్పబడుతుంది.

4. కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది :

చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, అంతేకాకుండా కళ్ళ కండరాలకు, నరాలకు పోషణను అందివ్వడంలో సహాయం చేస్తాయి. చేపలను తరచుగా తీసుకోవడం మూలంగా, మీ దృష్టిని మెరుగుపరచడానికి మరియు దృష్టి సంబంధిత సమస్యలు తలెత్తకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

5. ఆర్థరైటిస్ను నివారిస్తుంది :

ముందు చెప్పినట్లుగా చేపలలో, మీ శరీరానికి వివిధ రకాలుగా సహాయపడగలిగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో ఇది గణనీయమైన పాత్రను పోషిస్తుంది. చేపల్లో విటమిన్ ఇ ఉండటం కూడా ఇందుకు మరొక కారణంగా చెప్పబడుతుంది.

6. క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తుంది :

అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, రోజువారీగా మీ ఆహారంలో చేపలను జోడించడం ద్వారా, పెద్దపేగు క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మొదలైన అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు చేపలలో కేన్సర్ కారక కణాల అసాధారణ పెరుగుదలను నిరోధించగలవని చెప్పబడుతుంది.

7. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది :

చేపలను తరచుగా సేవించడం మూలంగా మీ నిద్ర నాణ్యత మెరుగుపడగలదని చెప్పబడుతుంది. చేపల వినియోగం పెంచడంద్వారా, అనేకమంది మెరుగైన నిద్ర నాణ్యతను సాధించారనే వాదనకు ఊతమిచ్చేలా, అనేక అధ్యయనాలు ఫలితాలను ఇచ్చాయి కూడా. ఇది అధిక గాఢత కలిగిన విటమిన్ డి నిక్షేపాల మూలంగా సాధ్యపడుతుందని చెప్పబడింది.

8. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది :

శరీరంలోని LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను అధికంగా కలిగి ఉన్న వనరుగా చేపలు ఉంటాయి. ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో, మరియు శరీరంలో తిరిగి కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో ఎంతగానో సహాయం చేస్తుందని చెప్పబడుతుంది.

9. ఆటో ఇమ్యూన్ (రోగనిరోధక శక్తి సంబంధిత) వ్యాధులను నివారిస్తుంది :

వివిధ అధ్యయనాల ప్రకారం, తరచుగా మీ ఆహార ప్రణాళికలో మంచి కొవ్వులు కలిగిన చేపలను తీసుకోవడం మూలంగా, టైప్ 1 మధుమేహం వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులను నిరోధించడంలో సహాయపడగలదని చెప్పబడింది. చేపలలో కనిపించే విటమిన్ డి యొక్క అధిక నిక్షేపాలు, శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో, మరియు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను క్రమబద్దీకరించడంలో సహకరించగలవని చెప్పబడుతుంది.

10. ముందస్తు బహిష్టు సమస్యలను తగ్గిస్తుంది :

బహిష్టులో వచ్చే అసమతుల్యతలతో బాధపడే మహిళలు, తమ ఆహారంలో చేపలను తరచుగా చేర్చుకోవడం మంచిదిగా సూచించబడుతుంది. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న కారణంగా, ఇది సాధ్యపడుతుందని చెప్పబడుతుంది.


FOLLOW US FB 74K FOLLOWED

1000 మంది చిన్నారుల గుండెకు అండగా.... మహేష్ బాబు!

అలనాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి!: Remembering Old Memories

కడుపుబ్బా నవ్వితే ఇన్ని ప్రయోజనాలా.. మీరు ఓ లుక్కేయండి

ఆంధ్ర లో తప్పక చూడవలసిన ప్రదేశాలు

WATCH ESHA అంబానీ HOME అంబానీ వారింటి అమ్మాయికి అత్తింటికానుక..

>

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 3 పేజ్

కాజల్ అగర్వాల్ 50 Photos

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

ఆయుర్వేదం 100 చిట్కాలు .. నాటు వైద్యం 2 పేజ్

తెలుగు వార్తలు , తెలుగు సినిమాలు, ఆరోగ్యం, వినోదం, విహారం, latest telugu news

           
Follow us facebook-for-gobest-for-facebook-page instagam-follow-gobest-site-best-instagram-follow twitter-gobest-best-follow-tweet